మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను….’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. సుబ్బారావు గుప్తాపై దాడిచేసిన సుభానీపై పోలీసులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. సుబ్బారావు గుప్తాపై దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత సుభానీని వన్ టౌన్ పోలీసులు…
ఏపీలో అధికారపార్టీని విమర్శించే స్వంత పార్టీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. దాడులు చేయడం జన్మ హక్కుగా వైసీపీ వ్యవహారిస్తోంది.సీఎం జగన్ స్పందించి, సుబ్బారావుపై దాడికి పాల్పడిన వ్యక్తుల చేత గుప్తా కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పించాలి. సుబ్బారావుపై దాడి చేసిన వారిని పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టించి, పోలీసుల చేత అరెస్టు చేయించాలి. దాడులతో భయోత్పాతం సృష్టిస్తే అడ్డుకట్ట వేయడానికి…
ఇటీవల వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా చేసిన వైసీపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గత రెండు రోజులుగా ఏపీల హాట్‌టాపిక్‌గా నడిచిన ఈ విషయానికి నేడు జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తెరపడింది. విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కలిశారు. సీఎం జగన్ జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. మంత్రి బాలినేని తనపై దాడి చేయించినట్లు…