ఇటీవల వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా చేసిన వైసీపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గత రెండు రోజులుగా ఏపీల హాట్‌టాపిక్‌గా నడిచిన ఈ విషయానికి నేడు జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తెరపడింది. విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కలిశారు. సీఎం జగన్ జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. మంత్రి బాలినేని తనపై దాడి చేయించినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని ఆయన అన్నారు.
సుభాని అనే వ్యక్తి ఓవరాక్షన్ వలనే ఈ రచ్చకు కారణం అని గుప్తా వెల్లడించారు. నేను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంట వున్నానని, నేను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశానని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేరని, పార్టీని బతికించుకోవాలనే ఆకాంక్షతో నేను చేశాను తప్ప ఎటువంటి దురుద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. మరో 29ఏళ్లపాటు సీఎం జగన్ సీఎం గా ఉండాలని, ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నానని సుబ్బారావు అన్నారు.