China: చైనాలో ముస్లింలపై అణిచివేత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో నివసించే ముస్లింలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇస్లాంను ఆచరించకుండా అక్కడి ప్రజలపై నిర్బంధం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ముస్లింలకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల రంజాన్ పండగ సందర్భంగా చైనా అధికార యంత్రాంగా వీగర్ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదు రేడియో ఫ్రీ ఏషియా తన కథనంలో పేర్కొంది.
చైనాలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆదివారం మరోసారి భూకంపం వచ్చింది. జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్ లో ఆదివారం 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. అంతకుముందు రోజు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. జూన్ నెలలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో 5.8 తీవ్రతతో భూకంపం…