Brij Bhushan: రెజ్లర్ వినేష్ ఫొగట్ పై మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేష్ ఫొగట్ ఒలంపిక్స్‌లో మోసం చేసి ఫైనల్ వరకు వెళ్లిందని ఆయన ఆరోపించారు. అందుకే ఆమెకు పథకం రాకుండా దేవుడు శిక్షించాడని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు అన్నారు.
ఐదుగురు మహిళా రెజ్లర్లను వేధించినందుకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టు శుక్రవారం లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసింది. రూస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పూత్ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. Also read: Avika Gor: ఏంటి భయ్యా చిన్నారి పెళ్లికూతురు ఈ రేంజ్ లో రెచ్చిపోయింది.. భారతీయ చట్టాలలోని బాధితురాలు సంబంధించి సెక్షన్లు 354, 354A (లైంగిక…
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా తన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు ఒలింపియన్ వినేష్ ఫోగట్ మంగళవారం(డిసెంబర్ 26) రోజున తెలిపారు. మల్లయోధులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేసినప్పటికీ మహిళా రెజ్లర్‌లకు జరిగిన న్యాయంపై వినేష్ ఫోగట్ నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖలో వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు.
Sports Ministry Suspends New Wrestling Body: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త ప్యానెల్‌పై వేటు పడింది. క్రీడా మంత్రిత్వ శాఖ విధివిధానాలను అతిక్రమించిన కారణంగా డబ్ల్యూఎఫ్‌ఐను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. సంజయ్ సింగ్ నేతృత్వంలోని కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ బాడీపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. భారత…
ప్రపంచ వేదికపై భారత్‌కు పెద్ద అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎమ్‌డబ్ల్యూ వెల్లడించింది.
దేశంలోని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు తనపై మోపిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఢిల్లీలోని కోర్టు సమన్లు జారీ చేసింది.
మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం నాడు తనపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుంటానని అన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో అగ్రశ్రేణి క్రీడాకారులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. మాజీ ఒలింపియన్ అయిన పీటీ ఉష అక్కడ గుమిగూడిన మీడియాతో మాట్లాడకుండా నిరసన స్థలం నుంచి వెళ్లిపోయారు.