Brij Bhushan: రెజ్లర్ వినేష్ ఫొగట్ పై మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేష్ ఫొగట్ ఒలంపిక్స్‌లో మోసం చేసి ఫైనల్ వరకు వెళ్లిందని ఆయన ఆరోపించారు. అందుకే ఆమెకు పథకం రాకుండా దేవుడు శిక్షించాడని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు అన్నారు. వినేష్ ఫొగట్‌తో పాటు బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ చైర్మన్‌గా బాధ్యతలను అప్పగించింది. దీంతో బ్రిజ్ భూషణ్ సింగ్ వారిని లక్ష్యంగా చేస్తూ విమర్శలు గుప్పించారు. గతేడాది రెజ్లర్లను లైంగికంగా వేధించారని బ్రిజ్ భూషన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.
Read Also: Pope Francic : ఇండోనేషియాలో పోప్ ఫ్రాన్సిస్‌పై దాడి.. ఏడుగురు నిందితులు అరెస్ట్
ఇక, బజరంగ్ పునియా ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొన్నారని బ్రిజ్ భూషన్ ఆరోపించారు. ఒలింపిక్‌కు హాజరయ్యేందుకు ఫొగట్ మోసం చేశారని అన్నారు. దేవుడు ఆమెను శిక్షించినందున ఆమె పతకం గెలవలేకపోయిందని అన్నారు. స్పోర్ట్స్ రంగంలో హర్యానా భారతదేశానికి కిరీటం లాంటిదన్నారు. ఇక, బరువు కొలిచిన ఐదు గంటల పాటు ట్రయల్స్‌కు రెస్ట్ ఇస్తారా.. ఒకే రోజులో రెండు వెయిట్ కేటగిరీల్లో ట్రయల్స్ ఇవ్వొచ్చా అని వినేష్ ఫోగట్‌ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ ప్రశ్నించారు.
#WATCH | "Haryana is the crown of India in the field of sports. And they stopped the wrestling activities for almost 2.5 years. Is it not true that Bajrang went to the Asian Games without trials? I want to ask those who are experts in wrestling. I want to ask Vinesh Phogat… pic.twitter.com/NQvMVS6dPF
— ANI (@ANI) September 7, 2024