WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఎన్నికలు జులై 4న జరుగుతాయని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సోమవారం వెల్లడించింది. జమ్మూ అండ్ కశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ మిట్టల్ కుమార్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది.
Also Read : Lifestyle : మగవాళ్ళు చేసే ఈ పనులు ఆడవారికి అస్సలు నచ్చవట..
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. WFI ముందుగా మే 7న ఎన్నికల తేదీని ప్రకటించింది. అయితే వివాదాల కారణంగా భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు నిరాకరించింది. ఎన్నికలను నిర్వహించడానికి ఇద్దరు సభ్యుల తాత్కాలిక కమిటీని నియమించి, నూతనంగా ఎన్నికల ప్రక్రియను స్టార్ట్ చేసింది.
Also Read : Bihar: బీహార్ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా విసిరేశాడు.. చివరికి..
కాగా, గత కొన్ని నెలలుగా భారత రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో పలు చర్చల అనంతరం రెజ్లర్లు ఓ మెట్టు కిందకు దిగారు. జూన్ 15వ తేదీ వరకు ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు రెజ్లర్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం ముందు రెజ్లర్లు ఐదు డిమాండ్లు ఉంచారు.
Also Read : Laptop Charging: చార్జింగ్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించాలి..!!
1. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలి.. 2. కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండొద్దు. 3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి. 4. పార్లమెంట్ ఓపెనింగ్ రోజు జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి. 5. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలి అనే డిమాండ్లను కేంద్రం ముందు రెజ్లర్లు ఉంచారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..