Wrestlers vs WFI: దేశంలోని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు తనపై మోపిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఢిల్లీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. దాదాపు ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. బ్రిజ్ భూషణ్ సింగ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
Also Read: Karnataka Budget 2023: బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సిద్ధరామయ్య.. ఎక్సైజ్ సుంకం భారీగా పెంపు
జూన్ 2న, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు, 10 ఫిర్యాదులు నమోదు చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదులలో ఆయన అనుచితంగా తాకడం, అమ్మాయిల ఛాతీపై చేయి వేయడం, ఛాతీ నుంచి వెనుకకు తన చేతిని తరలించడం, వారిని వెంబడించడం వంటి చర్యలను పేర్కొన్నారు.