దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసనల కారణంగా గత నాలుగు నెలలుగా క్రీడలో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. తనను ఉరితీసినా సిద్ధంగా ఉన్నానని.. అయితే జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, క్యాంపులతో సహా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోకూడదని, ఇది క్యాడెట్, జూనియర్ రెజ్లర్‌లకు హానికరమని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పేర్కొన్నారు.
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్, ఇతరులు శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ తాజా నిరసనను కొనసాగించారు.
మహిళా రెజర్లు తనపై చేసిన ఆరోపణలపై జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనలో శక్తి ఉన్నంతవరకు పోరాడతానంటూ ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు కోసం నిరసన తెలిపిన రెజ్లర్ల అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఈరోజు ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను కోరింది. WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ మహిళా రెజ్లర్లు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పతకాలు తెచ్చిన రెజ్లర్లు.. లైంగిక వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమపై జరుగుతోన్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రెజ్లర్లు గళం వినిపిస్తున్నారు. వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన ప్రదర్శనకు దిగారు.