భారతదేశం గతంలో వ్యవసాయంపై ఆధారపడింది. ప్రపంచీకరణ తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా మారిపోయింది. వ్యవసాయంపై ప్రజలు ఆధారపడటం తగ్గిపోయింది. శ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించింది. అయితే.. ఉపాధిపై ఆధారపడటం పెరిగింది. దేశంలో పరిశ్రమల వృద్ధి కారణంగా ఉద్యోగావకాశాలు కూడా పెద్దఎత్తున సృష్టించబడ్డాయి.
READ MORE: Shocking: ‘‘ వారి గౌరవాన్ని కాపాడా ’’.. తల్లి, నలుగురు చెల్లెళ్లను చంపిన వ్యక్తి..
ఇదిలా ఉండగా.. ప్రపంచంలో అత్యధిక జీతం ఎవరికి వస్తుంది? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అన్ స్టాప్(Unstop) నివేదిక ప్రకారం.. అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగి భారతీయుడు. ఇది మన దేశానికి గర్వకారణం.. ఈ వ్యక్తి నెలవారీ జీతం 1458 కోట్ల రూపాయలు. వార్షిక ప్యాకేజీ 17 వేల 500 కోట్ల రూపాయలు. ఈయన రోజుకు 48 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఆ భారతీయుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయన పేరే.. జగదీప్ సింగ్.
READ MORE: 26/11 Mumbai Attack: త్వరలో భారత్‌కు.. 26/11 ముంబై దాడిలో ప్రమేయం ఉన్న ఉగ్రవాది!
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీఈవోగా గుర్తింపు పొందారు. జగ్దీప్ సింగ్ క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలను పరిశోధిస్తుంది. ఈ కంపెనీకి సీఈవోగా ఉన్న జన్‌దీప్ సింగ్.. ఎలాన్ మస్క్ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. ఆయన ఒక్క రోజు జీతం చాలా కంపెనీల వార్షిక టర్నోవర్. జగ్దిప్ సింగ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బి.టెక్ పూర్తి చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు. క్వాంటం స్కేప్ కంపెనీని స్థాపించడానికి ముందు వివిధ కంపెనీలలో కీలక పదవుల్లో పని చేశారు.