Blast : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని…
SS Pharma: అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న జేఎన్ ఫార్మా సిటీలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సాయిశ్రేయాస్ (ఎస్.ఎస్) ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం సంభవించింది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఈ ఘటన జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిల్వ చేసిన కెమికల్స్ లెవెల్స్‌ను చెక్ చేయడానికి ముగ్గురు కార్మికులు వెళ్లారు. ఈ సమయంలో మ్యాన్‌హోల్‌ను ఓపెన్ చేయడంతో ప్రమాదవశాత్తూ తీవ్ర విషపూరిత వాయువులు…
GHMC : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సీరియస్ అయింది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి అనుమతుల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలడంతో, సంబంధిత భవనానికి ఇచ్చిన అనుమతులను బల్దియా రద్దు చేసింది. అపార్ట్‌మెంట్ నిర్మాణంలో సెట్ బ్యాక్ లేకపోవడంతో పాటు, బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయకుండా సెల్లార్ తవ్వకాలు జరిపినట్టు విచారణలో స్పష్టమైంది. అంతేగాక, ఈ తవ్వకాలు GHMC అధికారుల అనుమతి లేకుండా జరిగినట్టు…