Blast : పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు.. 5గురు మృతి
- పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు
- పాశమైలారంలోని సీగాచి కెమికిల్స్ పరిశ్రమలో పేలిన రియాక్టర్
- పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డ కార్మికులు
- 20 మందికిపైగా కార్మికులకు తీవ్రగాయాలు.. పలువురు మృతి చెందినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blast : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి.
పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని ప్రత్యక్షదారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు మృతి చెందగా, ఇంకా 20 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read
Star Wars : ఆ ఇద్దరి స్టార్స్ మధ్య మరోసారి నువ్వా నేనా.?
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర గాయాలపాలైనవారిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు.
పేలుడు సమయంలో పరిశ్రమలో ఉన్న పలువురు కార్మికులు బయటకు పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే పేలుడు శబ్దం దూరం వరకు వినిపించడంతో పరిసర ప్రాంతాల్లోని స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు, సహచర కార్మికులు చేరుతున్నారు.
ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా, గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలో ఇంకా మంటలు కొనసాగుతుండటంతో రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికి స్పష్టంగా తెలియకపోయినా, రియాక్టర్ లో ఏదైనా సాంకేతిక లోపం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పరిశ్రమలో రక్షణ నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై అధికారుల దృష్టి వెళుతోంది.
Regina Cassandra : సొగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న రెజీనా కాసాండ్రా
తాజావార్తలు
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!