SS Pharma: ఫార్మాసిటీలో విషవాయువు లీక్.. ఇద్దరు మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Pharma: అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న జేఎన్ ఫార్మా సిటీలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సాయిశ్రేయాస్ (ఎస్.ఎస్) ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం సంభవించింది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఈ ఘటన జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిల్వ చేసిన కెమికల్స్ లెవెల్స్‌ను చెక్ చేయడానికి ముగ్గురు కార్మికులు వెళ్లారు. ఈ సమయంలో మ్యాన్‌హోల్‌ను ఓపెన్ చేయడంతో ప్రమాదవశాత్తూ తీవ్ర విషపూరిత వాయువులు బయటకు విడుదలయ్యాయి. దీనివల్ల అక్కడి పని చేస్తున్న ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Read Also: Midhun Reddy: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కీలక విచారణ..!
Also Read
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
ఈ విషవాయువులను పీల్చిన ముగ్గురిలో ఇద్దరు చికిత్స పొందుతున్న సమయంలో కోలుకోలేక మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషయంగా ఉంది. మృతి చెందిన వారిని పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్, తెలంగాణ), సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్, మునగపాక, అనకాపల్లి) గా గుర్తించారు. మరో కార్మికుడు బైడూ భైసాల్ (హెల్పర్, బోడెన్, ఒడిశా) పరిస్థితి విషయమించడంతో ఆయనను చికిత్స నిమిత్తం విశాఖపట్నం షీలానగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
Read Also: Nikhil : హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం..
పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల దేహాలను విశాఖ కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పరిశ్రమ భద్రతా ప్రమాణాలపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మరింత చర్చకు దారితీస్తోంది. ఈ ప్రమాదం ప్రధాన పరిశ్రమలో కాకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కెమికల్ హ్యాండ్లింగ్, సేఫ్టీ ప్రోటోకాల్‌లపై పరిశ్రమ యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..