వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లను గెలిచిన చరిత్ర దక్షిణాఫ్రికా పురుషుల జట్టుకు లేదు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం ఓ కారణం అయితే.. దురదృష్టం వెంటాడడం మరో కారణంగా ప్రొటీస్ ఇన్నాళ్లు టైటిల్ గెలవలేదు. టీ20 ప్రపంచకప్ 2024లో ఫైనల్స్‌కు చేరినా.. భారత్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. మహిళల జట్టు కూడా తృటిలో టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా…
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగింది. టైటిల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 32 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్ అవతరించింది.
Womens T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టిస్తుంది. వెస్టిండీస్‌ను ఓడించి న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో అడుగు పెట్టగా, దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. సెమీ-ఫైనల్లో న్యూజిలాండ్ వెస్టిండీస్‌ను ఓడించగా, దక్షిణాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు…
Womens T20 World cup 2024 Semi finals: మహిళల టి20 ప్రపంచ కప్ 2024 నాలుగు సెమీ-ఫైనలిస్ట్ జట్లు తెలిసిపోయాయి. ముందుగా గ్రూప్-A నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సెమీఫైనల్‌కు చేరాయి. ఇప్పుడు గ్రూప్-B లోని మిగిలిన రెండు జట్లు కూడా సెమీఫైనల్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. పాకిస్థాన్ ఓటమితో టీమ్ ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. గ్రూప్-Aలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత గ్రూప్-Bలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరాయి. ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ విజయం…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కథ ముగిసింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిస్తే.. సెమీస్ అవకాశాలు ఉంటాయని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో కివీస్ 54 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి నాకౌట్ చేరింది. ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. భారత్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత జట్టు ఫామ్, ప్లేయర్స్‌ను చూస్తే కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. టీ20 ప్రపంచకప్ కోసం బయల్దేరే…
Womens T20 World Cup 2024: ఈ ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లపై సిరీస్ ఓటములను చవిచూసింది, కానీ బంగ్లాదేశ్‌పై సిరీస్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించింది. జూలైలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా అయింది. దీని తర్వాత, 2024 ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్‌లో అజేయంగా నిలిచిన భారత జట్టు శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024…
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా టీ20 ప్రపంచకప్ 2024కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి యూఏఈలో మహిళల పొట్టి కప్పు మొదలవుతోంది. గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను స్కాట్లాండ్ ఢీకొంటోంది. మరో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక తలపడతాయి. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుండగా.. రెండో మ్యాచ్ రాత్రి 7.30కి ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ప్రపంచకప్ మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఆరుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా డిఫెండింగ్…
Womens T20 World cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలిసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత మహిళల జట్టు పూర్తిగా సిద్ధమైంది. ఈసారి టి20 ప్రపంచ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరగనుంది. టోర్నీలో ఏ ఆటగాళ్లు పాల్గొంటారనేది ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. పూనమ్…
Smriti Mandhana About Virat Kohli: టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనకు ఫేవరేట్ బ్యాటర్ అని తెలిపారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోహ్లీని తాను కలిశానని, అతడి నుంచి కొన్ని సూచనలు తీసుకున్నానని వెల్లడించారు. కోహ్లీ, స్మృతిలు ఐపీఎల్ ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి.