NZ W vs SA W: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్- 2024 విజేత న్యూజిలాండ్..
- ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్
- ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 32 పరుగుల తేడాతో విజయం
- 20 ఓవర్లలో 158/5 పరుగులు చేసిన న్యూజిలాండ్
- 20 ఓవర్లలో 126/9 పరుగులు చేసిన సౌతాఫ్రికా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగింది. టైటిల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 32 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ అవతరించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో అమేలియా కెర్ అత్యధికంగా (43) పరుగులు చేసింది. ఆ తర్వాత.. బ్రూక్ (38), బేట్స్ (32) పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో మ్లాబా రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత.. ఖాకా, ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ తలో వికెట్ పడగొట్టారు.
Read Also: Jammu Kashmir: వలస కార్మికులపై ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో.. సౌతాఫ్రికా ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో లారా వోల్వార్డ్ట్ అత్యధికంగా (33) పరుగులు చేసింది. ఆ తర్వాత.. తంజీన్ బ్రిట్స్ (17), చోలే ట్రైయాన్ (14), అన్నేకే బోష్ (9), మారిజాన్ కాప్ (8), సునే లూస్ (8) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్, బ్రూక్ హాలిడే తలో వికెట్ పడగొట్టారు. కాగా.. న్యూజిలాండ్ తొలి టీ20 వరల్డ్ కప్ ను సాధించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు.. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి టీ20 వరల్డ్ కప్ సాధించాయి.
Read Also: Sonia Gandhi: కూతురి కోసం రంగంలోకి సోనియా గాంధీ..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!