Womens T20 World cup 2024: ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్ బౌలర్స్ వీరే.!
- మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం.
- ఈసారి టి20 ప్రపంచ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరగనుంది.
- మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్స్ వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens T20 World cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలిసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత మహిళల జట్టు పూర్తిగా సిద్ధమైంది. ఈసారి టి20 ప్రపంచ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరగనుంది. టోర్నీలో ఏ ఆటగాళ్లు పాల్గొంటారనేది ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
పూనమ్ యాదవ్:
టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన భారత మహిళా స్పిన్ బౌలర్ పూనమ్ యాదవ్. 2014లో ఈ టోర్నీలో ఆమె తొలి మ్యాచ్ ఆడింది. 18 మ్యాచ్‌లు ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో ఆమె 13.82 సగటుతో, 5.6 ఎకానమీ రేటుతో 28 వికెట్లు తీసింది. ఆమె ఒక్కసారి 4 వికెట్లు తీయడంలో విజయం సాధించింది. అత్యుత్తమ ప్రదర్శన 4/19.
Also Read
రాధా యాదవ్:
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రాధా యాదవ్ రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఈమె ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఆడిన 12 ఇన్నింగ్స్‌లలో ఆమె 16.94 సగటుతో, 6.4 ఎకానమీ రేటుతో 17 వికెట్లు తీసింది. రాధా అత్యుత్తమ ప్రదర్శన 4/23. ఆమె 2018 సంవత్సరంలో టి20 ప్రపంచ కప్‌లో తన మొదటి మ్యాచ్ ఆడాడు.
దీప్తి శర్మ:
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దీప్తి శర్మ మూడో స్థానంలో ఉంది. ఆమె 15 మ్యాచ్‌లు ఆడి 15 ఇన్నింగ్స్‌లలో 25.60 సగటుతో, 6.85 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీసుకుంది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 3/15. ఈమె 2018 సంవత్సరంలో తన మొదటి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడింది. 2024లో ఎంపికైన భారత జట్టులో ఆమె కూడా ఓ సభ్యురాలు.
ప్రియాంక రాయ్, శిఖా పాండే:
ఈ జాబితాలో శిఖా పాండే, ప్రియాంక రాయ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రియాంక 2009లో తన తొలి మ్యాచ్ ఆడింది. ఆమె 8 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో 10.91 సగటుతో, 5.73 ఎకానమీ రేటుతో 12 వికెట్లు తీసింది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 5/16. ఇక శిఖా పాండే గురించి చూస్తే..15 మ్యాచ్‌లు ఆడితే అందులో 12 ఇన్నింగ్స్‌ల్లో 19.66 సగటుతో 12 వికెట్లు పడగొట్టింది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 3/14.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!