మీ అందరి అభిమానాన్ని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి చెప్పారు. అందరి ఆశీర్వాదంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025 గెలిచాం అని తెలిపారు. వరల్డ్‌కప్‌లో సమిష్టిగా రాణించాం అని, టీమ్ అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యం అయిందన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే అని, ముందు చాలా ఉందని తెలుగు తేజం శ్రీ చరణి చెప్పుకొచ్చారు. వన్డే ప్రపంచకప్‌లో శ్రీ చరణి సత్తా చాటిన విషయం తెలిసిందే.…
టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారంను ప్రకటించింది. అంతేకాదు పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలంను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో శ్రీ చరణి స్వయంగా చెప్పారు. మహిళా వన్డే ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో శ్రీ చరణి సభ్యురాలు అన్న విషయం తెలిసిందే. Also Read: Ambati Rambabu: కూటమి ప్రభుత్వానికి…
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణికి ఘన స్వాగతం పలికేందుకు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. విమానాశ్రయ సిబ్బంది ఎంఎస్కేను లోపలికి అనుమతి లేదంటూ అడ్దకున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే అంటూ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అడ్డుకుంది. ఈ విషయంపై ఎస్పీకి ఎంఎస్కే ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ జోక్యంతో ఎయిర్‌పోర్ట్‌లోనికి ఆయనకు అనుమతి దక్కింది. Also Read: Shree Charani: సీఎం చంద్రబాబుని కలిసిన…
టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. శ్రీ చరిణికి మంత్రులు అనిత, సంధ్యా రాణి, ఏసీఏ చైర్మన్ కేశినేని చిన్ని సహా మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్ స్వాగతం పలికారు. మహిళా క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణికి పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువా కప్పి ఘనంగా అసత్కరించారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన శ్రీ చరణికి…
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అరుంధతి రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. దేశమంతా సంబరాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు ఎందులోనూ తక్కువ…
Rohit Sharma: భారత మహిళల క్రికెట్ జట్టు తమ తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో.. భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. స్వదేశంలో ప్రపంచకప్‌ను కోల్పోవడం ఎంత బాధ కలిగిస్తుందో బాగా తెలిసిన రోహిత్‌కు ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో…
INDW vs SAW: మహిళల ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నాడు వైజాగ్ వేదికగా ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ (Nadine de Klerk) మెరుపు ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..? టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన…
India vs Pakistan: 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య నేడు (అక్టోబరు 5) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. తమ ప్రపంచకప్ ప్రచారాన్ని శ్రీలంకపై గెలుపుతో ప్రారంభించిన భారత్, మహిళల వన్డేల్లో తమ వరుసగా 12వ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. మరోవైపు, తమ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్‌కు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ…