Shree Charani: ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలా ఉంది!
- అందరి అభిమానాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది
- వరల్డ్‌కప్‌లో సమిష్టిగా రాణించాం
- ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ అందరి అభిమానాన్ని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి చెప్పారు. అందరి ఆశీర్వాదంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025 గెలిచాం అని తెలిపారు. వరల్డ్‌కప్‌లో సమిష్టిగా రాణించాం అని, టీమ్ అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యం అయిందన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే అని, ముందు చాలా ఉందని తెలుగు తేజం శ్రీ చరణి చెప్పుకొచ్చారు. వన్డే ప్రపంచకప్‌లో శ్రీ చరణి సత్తా చాటిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడి.. 78 ఓవర్లలో 14 వికెట్లు పడగొట్టారు.
శ్రీ చరణి ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వం తరఫున ఆమెకు ఘనంగా స్వాగతం దక్కింది. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీ చరణిని సీఎం, మంత్రి అభినందించారు. అనంతరం మంగళగిరి స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో తన అనుభవాలను పంచుకున్నారు.
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
‘అందరి అభిమానాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది. టీమ్ అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యం అయింది. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించే వారు. ACAలో శిక్షణ తీసుకున్నా. నన్ను క్రికెట్ వైపు మా నాన్న పంపించటానికి సమయం పట్టింది. ఇది మొదటి అడుగు మాత్రమే ముందు చాలా ఉంది, అందుకోసం కష్టపడుతా. ప్రభుత్వం తరపున గ్రూప్ 1 జాబ్ ఇస్తామని సీఎం చెప్పారు. రూ.2.5 కోట్ల డబ్బు, కడపలో స్థలం ఇస్తామని సీఎం తెలిపారు. ప్రధాని మోడీతో సమావేశం జరిగినప్పుడు మరింత ముందుకు ఎలా వెళ్ళాలనే విషయం చెప్పారు’ అని శ్రీ చరణి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!