Khairatabad : గణేషున్ని చూడ్డానికి వెళితే.. 900 మంది పోకిరీలు అరెస్ట్..
- ఖైరతాబాద్ గణేష్ వద్ద షీ టీం భారీ ఆపరేషన్
- మహిళలపై అసభ్య ప్రవర్తన.. 900 మంది పోకిరీలు పట్టుబాటు
- 55 మంది మైనర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
- నిమజ్జనం వరకు 24 గంటల నిఘా – మహిళలు 100కు ఫోన్ చేయాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khairatabad : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నవారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కేవలం ఏడురోజుల వ్యవధిలోనే సుమారు 900 మంది పోకిరీలను షీ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. షీ టీం దృష్టిలో పడిన వారిలో 55 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిని కౌన్సెలింగ్‌కు హాజరుపరచగా, పెద్దవారి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కొంతమందిని కోర్టులో హాజరు పరచే విధంగా కేసులు నమోదు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే తప్పించుకోవచ్చని భావించిన పోకిరీలకు షీ టీం షాక్ ఇచ్చింది. గణేష్ మండపాల వద్ద, నిమజ్జనం ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పదంగా ప్రవర్తించే వారిని గుర్తించి పట్టుకున్నారు.
PM Modi: ట్యాక్స్‌లతో చిన్న పిల్లలను వదలని కాంగ్రెస్.. జీఎస్టీ సవరణలపై మోడీ
Also Read
- New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
- IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
- TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
- Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
షీ టీం ఇన్చార్జి లావణ్య మాట్లాడుతూ, “మహిళలు, యువతులపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిమజ్జనం పూర్తయ్యే వరకు మా టీంలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తాయి. మహిళలు ఎలాంటి భయం లేకుండా వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి” అని సూచించారు. ఉత్సవ వాతావరణంలో సురక్షిత వాతావరణం కల్పించడం తమ బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం నిరంతర నిఘా కొనసాగుతుందని, ఇలాంటి చర్యల వల్ల పోకిరీలు వెనకడుగు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Nvidia: ఎన్విడియా సీఈఓ జాన్సన్ హువాంగ్ రాజీనామా..
-
Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
-
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!