Fatima Sana : నటి ఫాతిమా సనాషేక్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటుంది. దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. మొన్ననే మాధవన్ మూవీలో కూడా నటించింది. అలాగే విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందంటూ రూమర్లు రావడంతో అలా కూడా వార్తల్లో నిలిచింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఇతర విషయాలతోనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. నేను గతంలో కొంచెం అగ్రెసివ్ గానే ఉండేదాన్ని. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు ఊరుకునే దాన్ని కాదు.
Read Also : Shreya Dhanwanthary : ముద్దు సీన్ తీసేస్తారా.. సెన్సార్ బోర్డుపై నటి ఫైర్..
ఆ టైమ్ లో ఒకతను నన్ను అసభ్యకరంగా తాకాడు. నా ప్రైవేట్ పార్టులు టచ్ చేశాడు. కోపంతో అతన్ని కొట్టాను. అతను కూడా నన్ను కొట్టాడు. అందులో నా తప్పేం లేదు. నార్మల్ గా టచ్ అయినా నేను కొట్టేదాన్ని కాదు. కానీ ప్రైవేట్ పార్టులు టచ్ చేస్తేనే అంత కోపం వచ్చింది. అతని తప్పు ఉన్నా సరే నన్ను కొట్టడంతో చాలా బాధగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది ఫాతిమా సనాషేక్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫాతిమా గతంతో పోలిస్తే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.
Read Also : Mohanbabu : వాళ్లు క్షేమంగా ఉండాలి.. ట్రోలర్స్ పై మోహన్ బాబు..