Newly Married Women’s Suicides: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు..!! కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం వధువులకు.. నరకప్రాయంగా మారుతున్నాయి. పెళ్లి తర్వాత ఆ నరకంలో ఉండలేక.. కాళ్ల పారాణి ఆరక ముందే ఉసురు తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు మహిళలు ఉసురు తీసుకోవడం కలకలం రేపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మరీ దారుణం జరిగింది. ఉదయం పెళ్లి జరిగింది.. రాత్రి శోభనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రాత్రి ఇంటి గదిలోకి వెళ్లిన నవ వధువు హర్షిత సూసైడ్ చేసుకుంది. ఉదయం నుంచి పెళ్లి సందడితో కలకలలాడిన ఇంటిలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. అలాగే, సోమందేపల్లిలో ఉంటున్న కృష్ణమూర్తి, పద్మావతి ఏకైక సంతానం హర్షిత. కర్ణాటకలోని ఓ వ్యక్తికి ఇచ్చి ఆమెకు ఘనంగా పెళ్లి చేశారు. ఐతే ఈ పెళ్లికి ఆమెకు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. పెళ్లి కొడుకు దుర్వసనాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి కృష్ణమూర్తి తెలిపారు. మరోవైపు హర్షిత మృతికి కారణాలు కనుక్కునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
Read Also: Chain Snatching: చైన్ స్నాచింగ్ గ్యాంగుల బెడద.. ఏకంగా కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేశారు..
ఇక, ఉయ్యూరులోనూ ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు శ్రీవిద్య. ఈమెకు రాంబాబు అనే వ్యక్తితో 6 నెలల క్రితం వివాహమైంది. కానీ పెళ్లయిన రోజు నుంచే రాంబాబు వేధించేవాడని.. ఆమె రాసిన సూసైడ్ లేఖ ద్వారా తెలుస్తోంది. ఆమె రాసిన లేఖ అందరినీ కంట తడి పెట్టిస్తోంది. ముఖ్యంగా సాయి అనే మహిళతో తనను పోల్చేవాడని ఆమె తన లేఖలో పేర్కొంది. పదే పదే తాగి వచ్చి తనను శారీరకంగా విపరీతంగా హింస పెట్టేవాడని తెలిపింది. అంతే కాదు శాడిస్ట్ భర్తను అతని తల్లిదండ్రులను వదిలి పెట్ట వద్దని కోరింది. ప్రస్తుతం రాంబాబు పరారీలో ఉన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Chennai Engineer: లవర్ వదిలేశాడని.. ఈ కిలేడీ ఏం చేసిందో చూడండి..!
వాయిస్: ఇటు హైదరాబాద్‌లోనూ కేవలం పెళ్లైన 2 నెలలకే వధువు సూసైడ్ చేసుకుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు హసీనా ఖాతూన్. ఈమెకు 2 నెలల క్రితం బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాకు చెందిన తౌహీద్ అలీతో వివాహమైంది. వీరు హైదరాబాద్ పాతబస్తీలోని కిషన్‌బాగ్‌లో కాపురం పెట్టారు. కోటి ఆశలతో భర్త ఇంట్లో అడుగు పెట్టింది హసీనా. 2 నెలల వరకు వీరి సంసారం సజావుగానే సాగింది. కానీ ఒక్కసారిగా హసీనా ఖాతూన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హసీనా ఖాతూన్‌ను ఆమె భర్త, అత్తమామలు హత్య చేసి ఉంటారని హసీనా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా కారణాలు ఏవైనా కానీ ముగ్గురు నవ వధువులు.. చనిపోవడం మాత్రం కలకలం రేపుతోంది. పెళ్లంటే అన్నీ చూసుకునే చేసుకుంటారు. కానీ భర్తతో వచ్చిన ఇబ్బందులను పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని..లేదా కోర్టుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.