Streenidhi VOA App: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద మహిళల జీవితాల్లో అభివృద్ధిని తీసుకొచ్చే దిశగా ఒక కీలక అడుగు పడింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్త్రీనిధి, యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన స్త్రీనిధి మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగంగా నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లో రుణాలు అందించేందుకు మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా…
CM Revanth Reddy : మహిళల శక్తిని ప్రేరణగా తీసుకుని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మహిళా స్టాళ్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ..…
Congress : కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే…
Preity Zinta : ఈ సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతుంది. 11 మ్యాచుల్లో 7 గెలిచి 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మెగా వేలానికి ముందు కేకేఆర్ విడుదల చేయడంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శ్రేయాస్ అయ్యర్ ని 26 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఓ వైపు బ్యాటర్ గా పరుగులు సాధిస్తూనే సారధిగా జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తున్నాడు. అయ్యర్ ఇప్పటివరకు 11 మ్యాచులో 405 పరుగులతో…
తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీ వంశీ అందుకూరి జీవితం, కష్టాలను సవాళ్లుగా మలచుకుని, కలలను నిజం చేసుకున్న అసాధారణ కథ. ఆర్థిక సంక్షోభాలు, సౌకర్యాల కొరత మధ్యలోనూ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో చదువును పూర్తి చేసిన వంశీ, మొబైల్ యాప్ టెస్టింగ్ రంగంలో తన కెరీర్‌ను మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక, వెబ్ డెవలప్‌మెంట్, మొబైల్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యం సంపాదించి, తన ఆలోచనలను వ్యాపారంగా మార్చడానికి ధైర్యంగా ముందడుగు వేశాడు.…
నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలోనే మరో ముందడుగు పడింది. మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ధ్యేయం చొరవతో టీం శివంగిని ఏర్పాటు చేశారు. అయితే.. టీం శివంగిని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అన్నింటిలో ముందుండాలి అని ఎస్పీ జానకీ షర్మిల కృషి అమోఘమన్నారు. ఈ మధ్య మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురి ఆడవారిని వెతికి పట్టుకోవటం లో వీరు పడ్డ కష్టం అభినందనీయమని, రాష్ట్రం…
సినీ ఇండస్ట్రీలో నిర్మాణ రంగం అంటే పూర్తిగా పైసల్తో పని. నిర్మాత బాగుంటేనే కళామతల్లి కలకాలం కళకళలాడుతోంది. అందుకే ఓ సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. ఈ రంగంలో రాణించాలంటే రిస్క్తో పని. హీరోల మార్కెట్, నిర్మాణ విలువలు, కాస్తంత లౌక్యం తెలిస్తేనే మనుగడ సాధించగలరు. ఒక్క సినిమా తేడా కొడితే చాలు బడా నిర్మాణ సంస్థలైనా బిషాణా ఎత్తేయడానికి. ఇంత స్ట్రగుల్ ఉంది కాబట్టి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు అనేక సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటి టఫ్…
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిం సమాజంలోని ఒక వర్గం దీనికి మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం వ్యతిరేకంగా ఉంది. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ, దాని మిత్రపక్షాలు ఐక్యంగా ఉండగా, ఇండియా బ్లాక్ దీనికి వ్యతిరేకంగా వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్లో ఈ వక్ఫ్ బిల్లుపై వాదనలు జరుగుతున్నాయి. పార్లమెంటులో చర్చకు ఎనిమిది గంటలు కేటాయించారు. ఇందులో ఎన్డీఏకి మొత్తం 4 గంటల 40 నిమిషాల…
ఒక్క వాహనం కాదు, వందల వాహనాల చప్పుళ్లు మార్పు శంఖారావాలా మారుతున్న ఈ ప్రయాణం పేరు – "యూనిటీ డ్రైవ్ – యునైటింగ్ ది నేషన్స్ ఆన్ వీల్స్". వన్ సీ (Onesea) మీడియా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం, హైదరాబాద్ నుంచి స్పితి వ్యాలీ దాకా కొనసాగనుంది. మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి విలువలపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడమే లక్ష్యం.
బీజేపీ కార్యాలయంలో సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశనం చేసే శక్తి భారత దేశానికే ఉంది. ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం అందరిలో పెరుగుతుంది. ప్రభలమైన మార్పులు దేశంలో చోటు చేస్కోబోతున్నాయి. పాడి పంటలతో దేశం, ప్రతి గ్రామం పరిడవిల్లుతుంది. కాంతిని పూజించడంలో ఆనందించేవారు భారతీయులు. భారతదేశాన్ని రక్షించే రాజకీయ పక్షం బీజేపీ.