Seethakka : బీజేపీపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. బీసీల రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని ఫైర్ అయ్యారు. బీసీల సాధికారత కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలన్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని అంశాలపై, ఇతర ప్రభుత్వ పథకాలపై మాట్లాడారు. బడి పిల్లల యూనిఫార్మ్ ల ద్వారా మహిళ సంఘాలకు 30…
Telangana : మహిళల ఆర్థిక సాధికారతకు తోడుగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధికి వడ్డీ లేని రుణాల రూపంలో భారీ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.344 కోట్లు విడుదల చేయగా, ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు. AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం! ఈ నిధులను సోసైటీ ఫర్…
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండుగ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని.. భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయన్నారు.. వ్యవసాయం దండుగా…
తొలి మహిళా కండక్టర్లను టీజీఎస్ ఆర్టీసీ సన్మానించింది. ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపోకు చెందిన శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.
దేశంలోని మహిళలను శక్తివంతం చేయడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలను నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై ఎక్కువ దృష్టి సారించింది. ఈ దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో మహిళల కోసం లఖ్పతి దీదీ యోజనను ప్రారంభించింది.
పోలవరం గ్రామానికి చెందిన యువతి అమెరికాలో తన ప్రతిభతో మన్ననలు అందుకుంటోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం భామ "మిస్ తెలుగు యూఎస్ఏ" కిరీటం సొంతం చేసుకుంది. పోలవరానికి చెందిన జాగాబత్తుల దుర్గాప్రసాద్, శ్రీవల్లి దంపతుల ఏకైక కుమార్తె నాగ చంద్రికా రాణి అమెరికాలోని ఫ్లోరిడాలో ఎంఎస్ చదువుతోంది. ఈనెల 25వ తేదీన డల్లాస్‌లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మిస్ తెలుగు యూఎస్ఏ పోటీలు నిర్వహించారు.
“మన్ కీ బాత్” లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ప్రస్తావించారు. “డ్రోన్ దీదీలు” తెలంగాణలో వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మోడీ ప్రశంసించారు. "గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారు. పండ్ల తోటలకు పురుగుమందులు, శీల్దార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకంటే వేగంగా, సమర్థవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. నీటిని, మందుల వినియోగాన్ని 30–40 శాతం వరకు…
Miss World 2025 : 72వ మిస్ వరల్డ్ పేజెంట్‌లో మరో కీలక దశను తాకింది. తెలంగాణలో నిర్వహించిన తొలి రౌండ్ విజయవంతంగా ముగిసిన అనంతరం, హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌కు ఎంపికైన 20 మంది ఫైనలిస్టుల పేర్లను తాజాగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అందగత్తెలు తమ వ్యక్తిత్వాన్ని, సమాజంపై ప్రభావం చూపే అంశాలపై చర్చించి ఈ రౌండ్‌కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా మొత్తం 107 మంది కాంటెస్టెంట్లు పాల్గొని, మానసిక ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య,…
Bhatti Vikramarka : జూన్ 2వ తేదీన ఐదు లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న లక్ష్యాన్ని సమయానికి సాధించేందుకు బ్యాంకర్ల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం, రాష్ట్రం అభివృద్ధి…