పోలవరం గ్రామానికి చెందిన యువతి అమెరికాలో తన ప్రతిభతో మన్ననలు అందుకుంటోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం భామ “మిస్ తెలుగు యూఎస్‌ఏ” కిరీటం సొంతం చేసుకుంది. పోలవరానికి చెందిన జాగాబత్తుల దుర్గాప్రసాద్, శ్రీవల్లి దంపతుల ఏకైక కుమార్తె నాగ చంద్రికా రాణి అమెరికాలోని ఫ్లోరిడాలో ఎంఎస్ చదువుతోంది. ఈనెల 25వ తేదీన డల్లాస్‌లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మిస్ తెలుగు యూఎస్‌ఏ పోటీలు నిర్వహించారు. ఈ పోటీ నాగ చంద్రికా రాణి ఎంతో ఆసక్తితో పాల్గొంది. టాలెంటెడ్ కేటగిరీలో అనేక మంది తెలుగు యువతులు పాల్గొనగా, నాగచంద్రికారాణి ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. చంద్రికారాణి ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఉయ్యూరులో, ఇంటర్, ఇంజినీరింగ్ విజయవాడలో పూర్తి చేసింది. 2023 సంవత్సరంలో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిందని, ఆగస్టులో పూర్తవుతుంది.
READ MORE: Miss World 2025: కాసేపట్లో మిస్ వరల్డ్ విజేత ప్రకటన.. ఎలా ఎంపిక చేస్తారంటే.!