Bhatti Vikramarka : బ్యాంకర్లు ఆర్థికసాయం చేస్తే.. సమాజానికి మరింత ఉపయోగం
- బ్యాంకర్లు సామాజిక బాధ్యత కూడా తీసుకోవాలి
- ఉద్యోగాలతో పాటు యువత స్వయం ఉపాధికీ అవకాశం కల్పిస్తున్నాం
- అందుకే.. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభిస్తున్నాం
- ఇప్పటికే.. రూ.6250 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది
- బ్యాంకర్లు ఆర్థికసాయం చేస్తే.. సమాజానికి మరింత ఉపయోగం :భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : జూన్ 2వ తేదీన ఐదు లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న లక్ష్యాన్ని సమయానికి సాధించేందుకు బ్యాంకర్ల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదు లక్షల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.6,250 కోట్లు సబ్సిడీతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు. యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలా పథకం రూపొందించామని తెలిపారు.
Uber Titanic : బెంగళూరు రోడ్లపై టైటానిక్ నౌక.. ఉబర్ కొత్త ప్రయోగం..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
రాజీవ్ యువ వికాసం పథకం సజావుగా అమలవడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారి నియమించి సమన్వయం చేయాలని, పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రత్యేకంగా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తోందని, ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి రూ.21 వేల కోట్లను బ్యాంకుల్లో జమ చేసి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే రైతు బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వం కట్టుతుందని తెలిపారు.
అదివి బిడ్డల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఇన్‌దిరా సౌర గిరి జల వికాస పథకం రూపకల్పన చేసి, రూ.12,600 కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల 70 వేల ఎకరాలలో సౌర విద్యుత్తును సాగులో ఉపయోగించాలని ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్షల కోట్లు వడ్డీ రహిత రుణాలుగా ఇస్తూ మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల కోసం ట్రైనింగ్ అందిస్తున్నామని తెలిపారు. మూసీ నదిని పునర్జీవం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య పారిశ్రామిక అభివృద్ధి కోసం వివిధ క్లస్టర్ల ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.
Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!