Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం మంచిది కాదని తెలిపింది.
చంచల్ గూడ జైల్లో అఘోరికి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టి గట్టిగా కేకలు వేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. నా భార్య వర్షినితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారని అధికారులతో అఘోరి వాగ్వాదానికి దిగారు. జైలు అధికారులు అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించారు. జైల్లో అఘోరీ ప్రవర్తనపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. చంచల్ గుడా జైలును నిన్న సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని…
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఈ కేసు విషయంలోనే నోటీసులు పంపగా.. వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో చాలా…
జానీ మాస్టర్ మీద నమోదైన రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని జానీ మాస్టర్ బాధితురాలు కలిసింది. ఈ నేపథ్యంలో మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారద మాట్లాడుతూ.. ఉమెన్ కమిషన్ పై నమ్మకంతో జానీ మాస్టర్ బాధితురాలు మమ్మల్ని ఆశ్రయించిందన్నారు.…
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై గురువారం జరిగిన దాడిని వివిధ వర్గాలు ఖండించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నాగర్‌కర్నూల్ పోలీసులను రిపోర్టు కోరింది. ప్రజలు, ముఖ్యంగా జర్నలిస్టు సంఘాలు మరియు మహిళా జర్నలిస్టులు ఈ సంఘటనను ఖండిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నేరాన్ని గుర్తించింది. కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరెళ్ల X లో పోస్ట్ చేసారు: “నమోదైన నేరాన్ని మహిళా…
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఇవాల ఉదయం 11 గంటలకు మహిళ కమిషన్ ముందుకు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారు.
ఎట్టకేళకు మహిళలకు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై బాబా రాందేవ్ అనుచిత వ్యాఖ్యలపై బాబా రాందేవ్‌కు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసినేపథ్యంలో.. బాబా రాందేవ్ క్షమాపణ లేఖ విడుదల చేశారు. మహిళలు తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు’ అంటూ యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
నిత్యం వివాదాలతో సావాసం చేసే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ద్రౌపది ముర్ము పై ఆర్జీవీ అనుచిత వాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. ఆర్జీవీ వెంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్జీవీ సినిమా రంగంలో పనిచేసే వ్యక్తి అని,…