జానీ మాస్టర్ మీద నమోదైన రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని జానీ మాస్టర్ బాధితురాలు కలిసింది. ఈ నేపథ్యంలో మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారద మాట్లాడుతూ.. ఉమెన్ కమిషన్ పై నమ్మకంతో జానీ మాస్టర్ బాధితురాలు మమ్మల్ని ఆశ్రయించిందన్నారు. మా మీద తనకు ఉన్న నమ్మకం నిలబెట్టుకుంటామని ఆమె తెలిపారు. తానే కాదు.. ప్రతి మహిళ కు న్యాయం చేయడానికి మేము పని చేస్తామన్నారు. పని చేసే వద్ద ఎలాంటి అర్రాస్మెంట్ కి గురైనా మహిళలు మా దృష్టికి తీసుకు రావాలని నా విజ్ఞప్తి అని ఆమె అన్నారు. ఇలాంటి సందర్భంలో పలుకుబడి ఉన్న వారి నుండి త్రేట్ ఉంటుందని, ఎంతటి పలుకుబడి ఉన్న మేము మహిళ లకు అండగా ఉంటామన్నారు. 40 పేజీల ఫిర్యాదును మహిళ కమిషన్ కి జానీ మాస్టర్ బాధితురాలు అందించినట్లు తెలిపారు. నేను ఛార్జ్ తీసుకుని రెండు నెలలు అవుతుందని, అప్పటి నుండి చాలా కేసులు నా దృష్టి కి వస్తున్నాయన్నారు.
CM Chandrababu: 3 పార్టీలు.. 3 రకాల స్వభావాలు.. కానీ ఒకటే ఆలోచన.. ఇది శాశ్వతంగా ఉండాలి..!
అంతేకాకుండా..’ఫ్రీవెన్షిన్ ఆఫ్ సెక్సువల్ అర్రాస్ మెంట్ కేసులు ఎక్కువయ్యాయి.. ఆడపిల్ల కు పరిమితులు పెట్టడం కరెక్ట్ కాదు.. నాలుగు గోడల మధ్య మహిళలను బందించడం కరెక్ట్ కాదు.. కలకత్తా ఘటన లో పని చేసే దగ్గర ఎం జరిగిందో చూసాం.. తెలంగాణ రాష్టంలో మహిళలు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు.. ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇబ్బందులు పెడుతున్నారు… సొంత మాస్టారు ఇబ్బంది పెడుతుంటే బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది.. మహిళా కమిషన్ మీద నమ్మకం తో వచ్చానని చెప్పింది.. కచ్చితంగా మహిళలు మహిళా కమిషన్ అండగా నిలబడుతుంది.. కోరి్యోగ్రాఫర్ మహిళా కు న్యాయం చేస్తాం.. తెలంగాణ రాష్టంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా కు మేము అండగా ఉంటాం.. కోరి్యోగ్రాఫర్ మహిళా కు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాము… సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కమిటీ కి సంబందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము..’ అని నేరేళ్ల శారద తెలిపారు.
Noida murder case: ఎయిర్‌లైన్ ఉద్యోగి హత్య కేసులో ఢిల్లీ లేడీ డాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!