చంచల్ గూడ జైల్లో అఘోరికి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టి గట్టిగా కేకలు వేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. నా భార్య వర్షినితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారని అధికారులతో అఘోరి వాగ్వాదానికి దిగారు. జైలు అధికారులు అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించారు. జైల్లో అఘోరీ ప్రవర్తనపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. చంచల్ గుడా జైలును నిన్న సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని ఉంచిన బ్యారక్ ను పరిశీలించారు. ఇప్పటికే న్యాయస్థానం 14 రోజులు జ్యూడిషయల్ రిమాండ్ విధించింది. కాగా.. మరోవైపు కోర్టు నియమించిన న్యాయవాది నేడు అఘోరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
అసలు ఏంటి ఈ కేసు?
కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలతో కలకలం సృష్టించిన అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చెందిన అఘోరీ అలియాస్ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఉండే మహిళ దగ్గర పూజలు చేయాలని చెప్పి రూ.9.80 లక్షలు వసూలు చేశారు. పూజకు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మహిళ మోసపోయానని గ్రహించింది. దీంతో మోకిల పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.
READ MORE: Khawaja Asif: ’30 ఏళ్లుగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాం’.. నిజం ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి…
ఈ కేసు దర్యాప్తులో ఉండగానే అఘోరీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లాడు. సైబరాబాద్ పోలీసులు అఘోరీని పట్టుకోవడానికి స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నగరానికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చేవెళ్ల కోర్టుకు తరలించగా, 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.