ఒక మహిళ తన ఇష్టానుసారం విడివిడిగా జీవిస్తుంటే భర్త నుంచి భరణం పొందే హక్కు ఆమెకు లేదని మధ్యప్రదేశ్ జబల్పూర్లోని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భర్త నుంచి విడివిడిగా ఉంటున్న మహిళ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. భర్త నుంచి విడిగా జీవించాలని మహిళ నిర్ణయించుకున్నందున ఆమెకు భరణం అడిగే హక్కు లేదని కోర్టు పేర్కొంది.
స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవడం.. ఒకరి బాధలు మరొకరు పంచుకోవడం అనేది ఫ్రెండ్షిప్లో కామన్. సినిమాల్లో చూసినట్లుగా ప్రేమికులకు స్నేహితులు సహాయం చేయడం చాలా చూసుంటాం.
ఢిల్లీ మాజీ మంత్రి, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు తన భార్యను కలిసేందుకు అనుమతి మంజూరు చేసింది. కస్టడీ పెరోల్ లో వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. అంతకుముందు తన భార్యను వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సిసోడియా తన దరఖాస్తులో కోరారు. కాగా.. మనీష్ సిసోడియా భార్య గత 20 సంవత్సరాలుగా…
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వివాహితకు భర్త శిరోమండనం చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చిత్ర హింసలు ఆమెకు గుండు గీసి పరారయ్యాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసిన కర్రి అభిరామ్, ఆశలు అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ప్రియుడితో కలిసి భర్తను హత మార్చింది భార్య. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో గత కొంతకాలంగా భర్త స్వామి, భార్య కావ్య నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే ఓ కారు డ్రైవర్ తో అక్రమసంబంధం పెట్టుకున్న కావ్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కిరాతకంగా చంపింది. పథకం ప్రకారం భర్తను ప్రియుడితో కలిసి కిడ్నాప్ చేసి నిజామబాద్ లో చంపింది భార్య. అనంతరం భర్త మృతదేహంను జవహర్ నగర్…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నిఖిల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.. కార్తికేయ, స్వామిరారా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో తన కెరీర్ లోనే బిగ్గెస్ విజయం అందుకున్నాడు..ప్రస్తుతం…
ఉద్యోగం, ఆదాయం లేనందున తన భార్యకు భరణం చెల్లించలేనని భర్త చెప్పడం తగదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కూలి పనులు చేసైనా రోజుకు రూ.300 లేదా రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది.
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని బంధువుల సాయంతో 20 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన దయనీయ ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదివారం రాత్రి పొరుగింటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆమె గుట్కా తీసుకుంది. ఇక, ఈ విషయం తెలిసిన భర్త శివకుమార్.. గుట్కా కావాలంటే తనను అడగొచ్చు కదా? అని పూజను నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 10 సెంట్ల స్థలం కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. భర్తకు గల పది సెంట్ల స్థలం అమ్మమని గత కొన్నాళ్ళ నుంచి ఒత్తిడి చేస్తుంది.