ప్రస్తుత జనరేషన్ తరుణంలో వివాహాలు జరుగుతున్న అవి ఎక్కువ రోజులు నిలబడడం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరిపించడానికి పెద్దలు అన్ని విధాల ఆలోచించి వారి వివాహం జరిపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్దలు మాట్లాడి చేసే పెళ్లిళ్ల కన్నా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అవ్వడం చూస్తున్నాం. ఇక మరోవైపు వాట్సాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు నుండి వారి మూడ్ బట్టి వారి స్టేటస్ ను పెడుతున్నారు. పుట్టినరోజైన, ఆనందపు విషయమైనా, బాధాకరమైన విషయమైనా ఇలా ఏదైనా సరే స్టేటస్ పెట్టి వారి ఫీలింగ్స్ ను ఇతరులకు తెలియజేస్తున్నారు. కొందరైతే ప్రతిరోజు గంట గంటకి స్టేటస్ లో ఏదో ఒకటి పెడుతూ పూర్తి సమయాన్ని వాటికి కేటాయిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..
Also read: Pakistan: సామాన్యులకు పాక్ సర్కార్ భారీ షాక్.. ప్రభుత్వంపై ఆగ్రహం..
కొందరు పెట్టే వాట్సాప్ స్టేటస్ లు చూస్తే ఫన్నీగా ఉండడం, దేవుడు వీడియోలు లాంటివి ఉండడం గమనిస్తూ ఉంటాము. ఇక తాజాగా ఓ వివాహిత పెట్టిన స్టేటస్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో నివాసం ఉంటున్న ఓ జంట 2022లో వివాహం జరగగా వారి మధ్య వచ్చిన కొన్ని కారణాల వల్ల పెళ్లి జరిగిన ఐదు నెలలకే భార్య వారి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇకపోతే తాజాగా భార్య తన భర్త వేధిస్తున్నాడని ఆయనను చంపేయాలంటూ.. ఆమె వాట్సప్ స్టేటస్ పెట్టింది. అంతేకాదు అందులో అది చంపిన వారికి రూ 50 వేలు ఇస్తానని కూడా ప్రకటించింది.
Also read: Chiranjeevi : నాకు ఎలాంటి సినిమాలు ఇష్టమో చెప్తే నవ్వుతారు..
ఇక ఈ స్టేటస్ చుసిన భర్త భయంతో తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసుల చెంతకు చేరాడు. దాంతో పోలీసులు వారి మధ్య రంగ ప్రవేశం చేశారు. ఇదే విషయంపై భర్త తమ మధ్య వచ్చిన వాద వివాదాలకు తన అత్తమామలు అలాగే వారి ఇంటి పక్కన ఉండే వ్యక్తి కారణమంటూ ఆరోపించాడు. వారి పక్కింట్లో ఉన్న వ్యక్తితో నా భార్యకి వివాహేతర సంబంధం ఉందని అతను వెల్లడించాడు. ఇదివరకే అతడు తనకి చాలామార్లు ఫోన్ చేసి చంపుతానని బెదిరించినట్లు పోలీసుల వద్ద వాపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.