AP Crime: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపు సావరంలో దూళ్ల సత్య శ్రీ (35) అనే వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. అనుమానంతో భార్యను భర్తే హత్య చేశాడు.. 16 ఏళ్లు క్రితం దూళ్ల సత్యశ్రీకి ఇదే గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ (సూరిబాబు)తో ప్రేమ వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య గత మూడు నెలలుగా వివాదం ఏర్పడింది. ఇరువురు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. అప్పటి నుండి కొద్ది రోజులు ఇరువురు కాపురం సాఫీగానే సాగింది. కానీ, భార్యపై భర్తకు అనుమానం పెరిగింది. ఇరువురు మధ్య గొడవలు మళ్లీ జరగసాగాయి.. ఈ ఉదయం ఇద్దరి మధ్య మాట మాట పెరడంతో కోపంతో ఊగిపోయిన భర్త సూరిబాబు.. గునపంతో భార్య సత్యశ్రీపై దాడి చేశాడు. గునపం పోట్లకు గురై. సత్యశ్రీ. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది..
Read Also: Kishan Reddy: సంత్ సేవాలాల్ చూపిన బాటలో యువత నడవాలి..
ఇక, రక్తపు మడుగులో పడి ఉన్న సత్యశ్రీని చూసిన స్థానికులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే సత్యశ్రీ మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్, కడియం సీఐ తులసీదర్.. హత్యపై ఆరా తీశారు.. భార్యపై అనుమానమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సత్యశ్రీని ఈమె భర్త సూర్యప్రకాష్ హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కాగా, మృతురాలికి ఓ పాప, ఓ బాబు సంతానంగా ఉన్నారు.. పాప ఐదవ తరగతి, బాబు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. నిందితుడు సూర్య ప్రకాష్ ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.