AP Crime: హృదయ విదారకం.. భర్త దారుణ హత్యను చూసి భార్య గుండెపోటుతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన 59 ఏళ్ల భర్త దారుణ హత్యను చూసిన అనంతరం 56 ఏళ్ల వయస్సు గల భార్య ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించింది.మరణించిన భార్యాభర్తలిద్దరినీ మూర్తి రావు గోఖలే, శోభా గోఖలేగా గుర్తించారు. అనంతపురం వన్‌టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డెప్ప తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని జేఎన్‌టీయూ క్యాంపస్ ఎదురుగా ఉన్న ఎల్‌ఐసీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మూర్తి రావు గోఖలే ఎస్కే విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. మృతుడు మూర్తి రావు గోఖలే మేనల్లుడు ఆదిత్యను హంతకుడిగా పోలీసులు గుర్తించారు.
Read Also: Citizenship Amendment Act: సీఏఏ అంటే ఏమిటీ?.. అమలు తర్వాత ఏ మార్పులు జరుగుతాయంటే?
Also Read
అసలేం జరిగిందంటే.. ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆదిత్య.. ప్రముఖ కంపెనీలో ప్లేస్‌మెంట్ ఇప్పిస్తానంటే తన మామ మూర్తిరావు గోఖలేకు లంచం ఇచ్చాడు. దీని తరువాత, మూర్తి రావు గోఖలే తన మేనల్లుడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. అంటే ఆదిత్యకి ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు. దీని తర్వాత గోఖలే ఆదిత్య కాల్స్‌ని తీయడం మానేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆదిత్య తన మామను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఆదిత్య పథకం వేసి ఆదివారం రాత్రి గోఖలే ఇంటికి చేరుకుని అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం ఎంతగా ముదిరిందంటే.. ఆదిత్య గోఖలేపై కత్తితో దాడి చేశాడు. గోఖలే గొంతు కోసి, అతని శరీరంపై కత్తులతో పలుమార్లు పొడిచాడు, ఫలితంగా అతను అక్కడికక్కడే మరణించాడు.
ఇంట్లోనే ఉన్న గోఖలే భార్య శోభ తన భర్తను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించగా.. ఆదిత్య ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. అయితే భర్త దారుణ హత్యను చూసిన శోభ కొన్ని గంటలకే గుండెపోటుకు గురై మరణించింది. అనంతపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఆదిత్యను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!