కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొచ్చి భయపెడుతున్నాయి. దేశంలో తాజాగా రెండు కొత్త వేరియంట్లకు సంబంధించి కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉద్ధృతి దేశంలో కాస్త తగ్గింది. కేసులు కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గాయ్. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించిన వేరియంట్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణేలో బీఏ4, బీఏ5 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.…
ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే డజన్ పైగా దేశాల్లో కేసులను కనుక్కున్నారు. తాజాగా మరో రెండు దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ), చెక్ రిపబ్లిక్ దేశాల్లో కొత్తగా మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూఏఈకి వచ్చిన ఓ మహిళలో వైరస్ ను నిర్థారించారు. బెల్జియం నుంచి చెక్ రిపబ్లిక్ కు వచ్చిన ఓ మహిళలో వైరస్ ను కనుక్కున్నారు. చెక్ రిపబ్లిక్…
ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా మంకీపాక్స్ వైరస్ కలవరం రేపుతోంది. ఇన్నాళ్లు కరోనాతో సతమతం అయిన ప్రపంచం ముందు మంకీపాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ వ్యాధి నెమ్మనెమ్మదిగా ఇతర దేశాల్లో కూడా బయటపడుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైంది. ఇప్పటికే కరోనా వ్యాధి పూర్తి స్థాయిలో సద్దుమణగక ముందే మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి విస్తరిస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. పెరుగుతున్న మంకీపాక్స్ వ్యాధి వల్ల ప్రపంచ…
ప్రపంచం ఓ వైపు కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతోంది. చైనా వూహాన్ లో మొదలైన కోవిడ్ వ్యాధి నెమ్మదిగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీంతో పలు దేశాల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు కరోనా తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఈ కేసుల సంఖ్య క్రమంగా…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ గ్లోబర్ కోవిడ్ సమ్మిట్ లో ప్రసంగించారు. కోవిడ్ నివారణకు భారత్ తీసుకుంటున్న చర్యలను, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా సాంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బారతదేశ జెనోమిక్స్ కన్సార్టియం ప్రపంచ వైరస్ డేటా బేస్ కు ఉపయోగపడిందని ఆయన అన్నారు. ఈ నెట్ వర్క్ ను పొరుగు దేశాలకు కూడా విస్తరిస్తామని వెల్లడించారు. కోవిడ్ పై మా పోరాటానికి, రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు సాంప్రదాయ జౌషధాలు…
కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం ఎంతో.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కోవిడ్.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. వైద్య రంగంలోని లోటును కళ్లకు కట్టింది.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహమ్మారి బారినపడి కోలుకోగా.. దాదాపు కోటిన్నర మంది ప్రాణాలు వదిలారు. కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడిచినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్)వో ప్రకటించింది. దేశాలవారీగా వివరాలను కూడా వెల్లడించింది.. భారత్‌లో కోవిడ్ మరణాలు 47 లక్షలని…
ప్రపంచ దేశాలను, ఆర్థిక వ్యవస్థను, అన్ని రంగాలను ఓ కుదుపుకుదిపిన కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతూనే ఉంది.. ఒమిక్రాన్ రూపంలో థర్డ్‌వేగా భారత్‌లో విజృంభించిన కోవిడ్ కేసులు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి.. కానీ, కరోనా కరోనా కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి.. ఇక, ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్‌లో రెండు సబ్ వేరియంట్లు.. బీఏ 4, బీఏ5 ఆందోళన కలిగిస్తున్నాయి.. కొత్త వేరియంట్ల వ్యాప్తి, ప్రభావంపై దృష్టి సారించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). కొత్త…
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ మ్యుటేట్ అవుతోంది. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనం చెందుతూ అనేక కొత్త వేరియంట్ల సృష్టికి కారణమవుతోంది. అందులో భాగంగానే ఏర్పడిన బీఏ.2 అనే ఉపరకం 95 శాతానికిపైగా ప్యూరిటీ ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే తాజాగా మరో రెండు కొత్త వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 సౌతాఫ్రికాలో బయటపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్…
చైనాలోని వూహాన్‌లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ మరో కొత్త రూపం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XE వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ BA2 సబ్ వేరియంట్ కంటే XE వేరియంట్ 10 రెట్లు…
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి.. మళ్లీ పంజా విసురుతోంది.. ఆసియా ఖండంతో పాటు యూరోప్ దేశాల్లో కరోనా విజృంభిస్తుండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచ దేశాలను మరోసారి అలెర్ట్ చేసింది. కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని వైరస్ సులభంగానే వ్యాపిస్తోందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గుముఖం పట్టడంతో వ్యాప్తి విస్తృతమవుతున్నట్లు తెలిపింది. వైరస్ ఇంకా పూర్తిగా క్షీణించలేదని, సీజనల్ వ్యాధిలా మారలేదని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు.…