కరోనా తగ్గుముఖం పడుతుందన్న సమయంలో.. చిన్నారులను పోస్ట్ కొవిడ్ లక్షణాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్లలు అక్యూట్ హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ వ్యాధితో పదిమంది పిల్లలు ప్రాణాలుకూడా కోల్పోయారు. ఈ అక్యూట్ హెపటైటిస్‌కు సంబంధించిన మొదటికేసు యూకేలో మొదటిసారి బయటపడింది. ఈ ప్రమాదకర కాలేయ వ్యాధికి కారణం అంతుచిక్కడం లేదు. సాధారణంగా హెపటైటిస్‌కు హెపటైటిస్- ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు వైరస్‌లు కారణమవుతాయి.…
ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ముప్పు ముంచుకొస్తోంది. దాదాపు 30 దేశాలకు విస్తరించి, ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి మంకీ పాక్స్. మంకీపాక్స్ పేరును మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్ణయించింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాయడంతో స్పందించిన డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని 30 దేశాల్లో 1,600 మందికి మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ కాగా.. మరో 1,500 అనుమానిత కేసులు ఉన్నాయి. ఐరోపా దేశాల్లో ఈ వైరస్…
కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్ మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. మంకీపాక్స్ మరిన్ని దేశాలకు విస్తరించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి?, దాని నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కానీ మంకీపాక్స్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అనే…
మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.. దానికి వ్యాక్సినేషన్‌తోనే చెక్ పెట్టాలని అనేక పరిశోధనలు తేల్చాయి.. దీంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.. భారత్‌లోనూ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.. కొన్ని దేశాల్లో మందకొడిగానే ఉంది. మరోవైపు, కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లో పుట్టుకొస్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. కరోనా వేవ్‌లు, బూస్టర్ డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. 4-6 నెలలకు ఒక…
రెండు వేవ్ లు సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఇంకా మర్చిపోలేదు..ఒమిక్రాన్ చడీ చప్పుడు లేకుండా దాటిపోయినా, ఇంకా కరోనా భయం పోలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. లేటెస్ట్‌గా కొత్త కేసులు 8 వేలకు పైగా రిపోర్ట్ అయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలను దాటేసింది. శుక్రవారం దాదాపు మూడున్నర లక్షలమందికి టెస్టులు చేస్తే, అందులో 8,329 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.…
మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే దాదాపు 50కి పైగా దేశాలకు విస్తరించింది. సుమారు 700 కిపైగా కేసులు బయట పడ్డాయి. మంకీపాక్స్ పేరు వినగా ప్రజలంతా జంకిపోతున్నారు. ఇక ఈవైరస్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్ దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో వెలుగు చూసింది.…
వచ్చేది వర్షాకాలం.. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడతారు. దీర్ఘకాలిక జలుబు, ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమా పెరగటానికి దోహదపడుతాయి. ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఉబ్బసం ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మంది ఆస్తమా బాధితులకు వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రమవుతుంది. అయితే వర్షాకాలంలో ఆస్తమా వున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో…
రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు కూర్చోగానే చాలా మందికి ఒంటినొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా కుదరదు. దీంతో చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుని నిద్రపోతుంటారు. ఒళ్లు నొప్పులతో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం శరీరానికి చాలా ప్రమాదకరం. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో చూసేద్దామా మరి.. ఇక చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు…