Monkeypox: మంకీపాక్స్ కేసులపై డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం ఓ వైపు కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతోంది. చైనా వూహాన్ లో మొదలైన కోవిడ్ వ్యాధి నెమ్మదిగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీంతో పలు దేశాల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు కరోనా తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తం అయింది. మంకీపాక్స్ వ్యాధిపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతోంది. మంకీపాక్స్ ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇటీవల మే 8న బ్రిటన్ లో మంకీపాక్స్ వైరస్ కేసు బయటపడింది. నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకింది. ఆ తరువాత బ్రిటన్ వ్యాప్తంగా మరో 9 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే విధంగా మే 18న కెనడా నుంచి అమెరికాకు వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు మసుచాసెట్స్ హెల్త్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. దీంతో పాటు స్పెయిన్, బెల్జియం, ఇటలీ, కెనడా, ఆస్ట్రేలియాల్లో మంకీపాక్స్ వైరస్ బయటపడుతోంది.
మంకీపాక్స్ చాలా అరుదైన, సీరియస్ వ్యాధి. అంత త్వరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లో ఎక్కువగా వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు చర్మంపై గాయాలు ఉన్న సమయంలో వ్యాధిగ్రస్తుడి నుంచి బాడీఫ్లాయిడ్స్ తో కాంటాక్ట్ అయితే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ ఆఫ్రికన్ దేశాల్లో ఈవ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ లాంటి లక్షణాలతో మొదలై, లింప్ నోడ్స్ వాయడం, చర్మంపై, మొహంపై దద్దర్లు రావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..