ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు చిత్తుగా ఓడింది. దీంతో టీమిండియాలోని పలువురు ఆటగాళ్లపై ఈ ఓటమి ప్రభావం గట్టిగానే పడేట్టుంది. టెస్టులలో కీలక ఆటగాళ్లైన నయా వాల్ ఛటేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్ లపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.
స్టిండీస్ లో భారత్ పర్యటన ఖరారైంది. జూలై నుంచి ఆగస్టులో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జూలై 20 నుంచి రెండో టెస్టు జరగనుంది.
లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కోల్ కతా జట్టు యాజమాన్యం అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికా మరో ముందడుగు వేసింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి.. వెస్టిండీస్ టీమ్ కు నిద్దపట్టకుండా చేసింది. మరొక్క గెలుపు సాధిస్తూ చాలు ప్రపంచకప్ రేసులో ప్రొటిస్ జట్టు ముందుకు వెళ్తుంది.
ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లు ఇప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు వెస్టిండీస్ మెగా క్రికెట్ ఈవెంట్‌కు ప్రత్యక్ష అర్హత కోసం ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి.
వెస్టిడీస్ గడ్డపై ఈ ఏడాది జులై-ఆగస్టులో టీమిండియా పర్యటించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ).. అదనంగా మరో రెండు టీ20లని కూడా సిరీస్ లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బ్యాటర్ బంతిని షాట్ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్ట్జే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్ ను ఒడిసిపట్టుకుంది. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్ గా నోర్జ్టే తీసుకున్న క్యాచ్ ను క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
West Indies: ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పసికూనలు ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలై సూపర్-12 దశకు అర్హత సాధించకుండానే వెస్టిండీస్ ఇంటిదారి పట్టింది. మొత్తం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం జింబాబ్వేపై మాత్రమే విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో దారుణ వైఫల్యం నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచకప్‌లో వైఫల్యానికి గల కారణాలను తెలుసుకున్న లారా…