టీమిండియా వైస్ కెప్టెన్ రహానేతో మాట్లాడిన మాటలు అందరూ షాక్ కు గురయ్యేలా ఉన్నాయి. రహానే కంటే వారికన్ ఎక్కువ బంతులు ఆడాడని ఇషాన్ స్టంప్ మైక్‌లో చెప్పాడు. ఈ సమయంలో రహానే స్లిప్ వద్ద నిలబడి.. ఇషాన్‌ను ఏమి అన్నావని అడిగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న రహానే మూడు పరుగులు చేశాడు.
IND vs WI 1st Test Highlights: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 130 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (7/71) మరోసారి తన స్పిన్ మాయాజాలం చూపించాడు. అరంగేట్రంలోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో…
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తిగా ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు ఆట స్టార్ట్ కాగానే ఓవర్ నైట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్క్ ను దాటేశాడు. ఈ క్రమంలోనే అతడు డెబ్యూ టెస్టులో 150 మార్క్ ను అందుకున్న ఐదో అతి చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును అందుకున్నాడు.
తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ, తన క్లాస్ బ్యాటింగ్ చూపించాలని తపన పడుతున్నాడంటే ఏమో అనుకోవచ్చు.. కానీ విరాట్ కోహ్లీ కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో అందరిని విసిగించాడు. మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్న విరాట్, 96 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు.. అది కూడా 81 బంతులు ఆడిన తర్వాత వచ్చింది.
వెస్టిండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో మాత్రం వీరిద్దరిలో ఎవరూ కూడా టాప్‌లో లేకపోవడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా విండీస్‌తో తమ తొలి సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలో డొమినికా వేదికగా ఇవాళ్టి (బుధవారం) నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో తమ స్థాయికి తగ్గట్లు కెప్టెన్ రోహిత్, కోహ్లి రాణించలేక పోయారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఓటమి తర్వాత సరిగ్గా నెల రోజుల విరామం అనంతరం భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. భారత జట్టు మరోసారి సంప్రదాయ క్రికెట్‌లో కొత్త పోరుకు సన్నద్ధమైంది. 2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్‌లో భాగంగా భారత్ తమ తొలి సిరీస్ బరిలోకి దిగనుంది.
ఒకప్పటి మేటి జట్టు నిలిచిన వెస్టిండీస్.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి దాదాపు రెండు దశాబ్దాల కాలం దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం. విండీస్ జట్టు లాస్ట్ టైం 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుపై విజయం సాధించింది. అప్పటి నుంచి దాదాపు 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై ఇప్పటి వరకు గెలవలేదు.
IND vs WI Dream11 Prediction Today Match: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) కొత్త సైకిల్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య జూలై 12 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు భారత్, వెస్టిండీస్ జట్లు సన్నదవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే వెస్టిండీస్ కన్నా.. భారత్ బలమైన…
విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే సహా పలువురు ఆటగాళ్లు డిఫరెంట్ డ్రిల్ చేస్తున్న వీడియోను బీసీసీఐ సోమవారం పోస్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డ్రిల్‌తో పాటు, టీమ్ ఇండియా తన ఫీల్డింగ్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేక కసరత్తు చేసింది.
ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా టీమ్ కు దూరంగా ఉన్నాడు. టీమిండియాలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో.. ఈసారి కూడా ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. కానీ వెస్టిండీస్ సిరీస్ లో ఇషాంత్ కనిపించనున్నాడు. భారత్, వెస్టిండీస్ సిరీస్‌లతో ఇషాంత్ అరంగేట్రం చేయబోతున్నాడంటే.. నిజమనే చెప్పాలి కానీ మ్యాచ్ లో కాదు. ఈ సిరీస్‌లో ఇషాంత్ కామెంట్రీ చేస్తూ కనిపించనున్నాడు.