ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ జూన్ 27న ప్రకటించనుంది.
Also Read: Fathers Day 2023: తండ్రిని సంతోషంగా ఉంచాలనుకుంటే.. ఈ చిట్కాలను అనుసరించవచ్చు..
ఈ పర్యటనలో టీమిండియా నుంచి కొత్తముఖాలను చూసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు. విండీస్ పర్యటనలో ఫియర్‌లెస్ క్రికెట్ ఆడే యంగ్ ప్లేయర్స్ ను జట్టులోకి తీసుకోవాలని జాఫర్ అన్నాడు. భారత జట్టు ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలి. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్‌లో మరింత దూకుడుగా ఆడాలి అని ఆయన అన్నారు. ధైర్యంగా ఆడే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి.. అప్పుడే మనం విజయాలు సాధిస్తాం.. అదే విధంగా టీ20 క్రికెట్ జట్టులో యశస్వి జైస్వాల్ వంటి విధ్వంసకర ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.
Also Read: Pawan Kalyan: నాకు ప్రాణహాని ఉంది.. ప్రత్యేక సుపారీ ఇచ్చారు
భారత్‌కు రింకూ సింగ్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.. అతడు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు.. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం జట్టులో లేడు కాబట్టి అతడి స్ధానంలో జితేష్ శర్మకు ఛాన్స్ ఇవ్వాలి.. అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేయగలడు.. నా వరకు అయితే విండీస్‌తో వన్డే సిరీస్‌కు సంజు శాంసన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది అని వసీం జాఫర్ అన్నాడు.