Navdeep Saini: భారత బౌలర్ నవదీప్ సైనీ వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు తనను సెలెక్ట్ చేయడంపై షైనీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటికే కౌంటీ క్రికెట్ ఆడేందుకు నవదీప్ సైనీ ఇంగ్లండ్ చేరుకోగా.. అతను వోర్సెస్టర్‌షైర్ తరపున కౌంటీ ఆడనున్నాడు.
Read Also: Jay Bloom On Titan: టైటాన్‌లో మమ్మల్ని రమ్మన్నారు.. కానీ షెడ్యూల్ కుదరక వెళ్లలేదు..జే బ్లూమ్
లండన్ చేరుకోగానే నవదీప్‌కి ఈ గుడ్ న్యూస్ తెలిసింది. వెస్టిండీస్ టూర్‌కు టీమిండియాకు ఎంపికైనట్లు తెలిసింది. వెస్టిండీస్‌తో 2 టెస్టులు, 3 వన్డేల సిరీస్‌కు టీమ్‌ఇండియాను చివరి రోజు బీసీసీఐ ప్రకటించగా, టెస్టు జట్టులోకి నవదీప్ కూడా ఎంపికయ్యాడు. నవదీప్ 2021లో భారత్ తరఫున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. బీసీసీఐ టీమ్ ను ప్రకటించే అంతకుముందే షైనీ లండన్ చేరుకున్నాడు. అయితే షైనీ లండన్ ఎయిర్ పోర్టులో దిగి బయటకు రాగానే ఆశ్చర్యపోయాడు. తాను వెస్టిండీస్ టూర్ కు ఎంపిక కావడం పట్ల నమ్మలేక పోతున్నానని నవదీప్ తెలిపాడు.
Read Also: Apple Pay: ఫోన్ పే, గూగుల్ పేకు ధీటుగా “ఆపిల్ పే”.. త్వరలో భారత్‌లోకి ఎంట్రీ..
గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా నవదీప్ సెలక్ట్ అయ్యాడు. అయితే గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో అతన్ని బీసీసీఐ సెలక్ట్ చేస్తుందని ఊహించలేదని తెలిపాడు. మరోవైపు నవదీప్ షైనీ వోర్సెస్టర్‌షైర్‌తో 4 కౌంటీ మ్యాచ్‌లకు సైన్ అప్ చేశాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో.. కౌంటీ జట్టుకు ఒకే ఒక మ్యాచ్‌ను మాత్రమే ఆడనున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్ టూర్ కు వెళ్లనున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ తన వెస్టిండీస్ పర్యటనకు మంచి అనుభవాన్ని ఇస్తుందని షైనీ తెలిపాడు. అయితే బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో నవదీప్ ని తీసుకున్నారు. ఈ సిరీస్ లో షమీకి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ.