ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు ఫలితం ఇరు టీమ్స్ మధ్య దోబూచులాడుతుంది. ఈ సీజన్ లో పలు జట్ల ప్లేయర్లు గాయాల బారిన పడుతూ టోర్నీకి దూరమైతే.. మరి కొందరు విదేశీ ప్లేయర్లు మాత్రం వ్యక్తిగత సమస్యల కారణంగా స్వదేశానికి వెళ్తున్నారు. వీరిలో కోల్ కతా జట్టు ప్లేయర్ ఒకరు లిట్టన్ దాస్.. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. లిట్టన్ దాస్ ను కేకేఆర్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది.
Also Read : Chopper Crash: కాశ్మీర్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..
లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కోల్ కతా జట్టు యాజమాన్యం అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. చార్లెస్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్. ఇవాళ సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ లో కేకేఆర్ తరపున అతడు జట్టులో చేరతాడని కేకేఆర్ యాజమాన్యం వెల్లడించింది. కోల్ కతా జట్టు ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్ లు ఆడింది. వాటిలో మూడు మ్యాచ్ లు మాత్రమే గెలిచి మిగిలిన ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదివ స్థానంలో నిలిచింది.
Also Read : Bandi sanjay: పొంగులేటితో ఈటల బృందం భేటీ.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేకేఆర్ జట్టులో కొత్తగా చేరే జాన్సన్ చార్లెస్ వెస్టిండీస్ తరపున 41 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లు ఆడాడు. 971 పరుగుుల చేశాడు.. 2016లో ఐసీసీ ప్రపంచ టీ20 విజేతగా వెస్టిండీస్ జట్టును నిలపడంలో జాన్సన్ కీలక పాత్ర పోషించాడు. వికెట్ కీపింగ్ లోనూ చార్లెస్ కు మంచి ట్రాక్ ఉంది. టీ20 ఫార్మాట్ లో ఐదు స్టంప్ అవుట్ లు చేశాడు. 82 క్యాచ్ లు పట్టాడు. జాన్సన్ చార్లెస్ 2012లో కేకేఆర్ టీమ్ లో సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో అతన్ని రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.