వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పాల్గొనలేదు. అయితే రెండో వన్డే కోసం అతడు జట్టుతో చేరిపోయాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కేఎల్ రాహుల్‌తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కరోనా నుంచి కోలుకున్న బౌలర్ నవదీప్ సైనీ కూడా జట్టుతో చేరారు. దీంతో బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. Read Also: పలు ఫ్రాంచైజీలు సంప్రదించాయి..…
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ దుమ్మురేపింది. 177 పరుగుల విజయలక్ష్యాన్ని 28 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియాకు వన్డేల్లో ఇది 1000వ వన్డే కావడంతో ఈ మ్యాచ్‌ను మరపురాని జ్ఞాపకంగా మార్చుకుంది. Read Also: మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా వెస్టిండీస్…
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా, షమీ లాంటి ఫ్రంట్ లైన్ బౌలర్లు లేకపోయినా వెస్టిండీస్‌ను 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ముందు 177 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్లుగానే భారత బౌలర్లు వెస్టిండీస్‌ను బెంబేలెత్తించారు. హోల్డర్ (57) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి అలెన్ (29) నుంచి సహకారం…
ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ దూరం కావడంతో రోహిత్ శర్మతో ఓపెనింగ్‌కు ఎవరు వస్తారో అన్న అంశంపై క్లారిటీ వచ్చింది. తొలి వన్డేలో తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాకు వెల్లడించాడు. ఇషాన్ కిషన్ ఒక్కడే ప్రస్తుతం ఆప్షన్‌గా ఉన్నాడని, తనతో పాటు అతడు ఓపెనింగ్ చేయనున్నట్లు రోహిత్ తెలిపాడు. Read Also: కుంబ్లే-కోహ్లీ మధ్య…
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పలువురు టీమిండియా క్రికెటర్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. బాధితుల్లో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారని తెలుస్తోంది. క్రికెటర్లతో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని జాతీయ మీడియా పేర్కొంది. Read Also: ఆ ఒక్క పరుగు తీయనందుకు.. న్యూజిలాండ్ ఆటగాడికి…
స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంతా సులభం కాదని, ప్రస్తుతం తమ జట్టుకు ఆ సత్తా ఉందని వెస్టీండిస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అన్నారు. ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడినా ఇంగ్లాండ్ పై తమ జట్టు అద్భుత విజయం సాధించి మళ్లీ ఫామ్‌లో కి వచ్చిందన్నారు. టీం ఇండియాతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు కీరన్ పొలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు నేడు భారత్‌కు రానుంది. ఈ నెల 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఇప్పుడు…
త్వరలో ఇండియాలో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్, కోల్‌కతాలలోనే జరగనున్నాయి. అయితే ఈసారి టీమిండియా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విమాన కంపెనీల నుంచి స్పందన రాకపోవడంతో ఈసారి క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని బీసీసీఐ చెప్తోంది. Read Also: ఐపీఎల్-15కు…
ఫిబ్రవరి తొలివారంలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం ఇరు జట్లను సెలక్టర్లు ప్రకటించారు. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు విభేదాలు తలెత్తాయి. ఆల్‌రౌండర్ ఓడెన్ స్మిత్ విషయంలో అతడు వివక్షపూరితంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో వెస్టిండీస్ జట్టులో లుకలుకలు బహిర్గతం అయ్యాయని విండీస్ మీడియాలో…
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఆల్‌రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని.. అందుకే అతడిని సెలక్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సిరీస్‌లకు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఫిట్‌గా లేని కారణంగా హార్డిక్…
దక్షిణాఫ్రికా గడ్డపై వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియా.. త్వరలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ప్రస్తుతం పూర్తి కోలుకుని ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. రోహిత్ బుధవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్…