కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ ఐదో బంతికే బ్రెండన్ కింగ్ (4)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్‌కు 8 పరుగుల వద్ద లైఫ్ దొరికింది. అతడిచ్చిన క్యాచ్‌ను పట్టే క్రమంలో రవి బిష్ణోయ్ బౌండరీ లైన్…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు టీ20ల్లో ఇదే తొలి సిరీస్. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్…
వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ జట్టును వైట్‌వాష్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇక, టీ-20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది.. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి భారత్-వెస్టిండీస్ జట్లు.. అయితే, టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పొట్టి పార్మాట్ సిరీస్‌కు దూరమయ్యారు.. వారి ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలను జట్టులోకి వచ్చినట్టు బీసీసీఐ…
సొంత గడ్డపై వన్డేసిరీస్‌ను క్లీన్‌స్విప్ చేసింది టీమిండియా… ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన… ఇవాళ జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లోనూ ఘన విజయాన్ని నమోదు చేసింది.. 96 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.. దీంతో వెస్టిండీస్‌పై 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది… విండీస్ ముందు 266 పరుగుల టార్గెట్‌ను పెట్టింది.. అయితే,…
ఈరోజు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచిన భారత్ ఇప్పుడు మూడో వన్డేపై కన్నేసింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. నామమాత్రపు వన్డే కావడంతో… ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న శిఖర్ ధావన్…
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియా చేసిన ప్రయోగాలపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌కు పంపించి… వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపడం సరికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు చాలా మంది ఓపెనర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పంత్‌ను ఓపెనింగ్‌కు పంపించి ప్రయోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. రోహిత్‌తో పంత్‌ను ఓపెనింగ్ పంపడం చివరి ఆప్షన్‌గానే…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న రెండో వన్డేలోనూ భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి.. 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 238 పరుగుల ఛేదనలో, వెస్టిండీస్ జట్టు విఫలం అయ్యింది… టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి.. విండీస్‌కు ముందు 238 పరుగుల…
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.. రెండో వన్డేలో టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.. అయితే.. ఈ మ్యాచ్‌లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లో టాప్‌స్కోరర్ కూడా అతడే.. ఇక, 83 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేసిన సూర్యకుమార్.. వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకీ సూర్యకుమార్ సృష్టించినా ఆ ప్రపంచ రికార్డు విషయానికి వస్తే……
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సత్తా చాటిన టీమిండియా… రెండో వన్డేలో కాస్త చిన్న టార్గెట్‌నే ప్రత్యర్థి జట్టుముందు ఉంచింది.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.. సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో.. కేఎల్ రాహుల్ 49 పరుగులతో రాణించారు.. రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రారంభించడంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కెమర్ రోచ్ 5 పరుగుల వద్ద…
అహ్మదాబాద్ వేదికగా ఈరోజు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ వన్డేను కూడా గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా ఆరాటపడుతోంది. మరోవైపు ఈ వన్డేలో గెలిచి సిరీస్ సమం చేసి.. తద్వారా సిరీస్ సాధించాలనే ఆశలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. దక్షిణాఫ్రికాలో పరాభవం తర్వాత రోహిత్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడిన తొలి వన్డేలో…