భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.. రెండో వన్డేలో టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.. అయితే.. ఈ మ్యాచ్‌లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లో టాప్‌స్కోరర్ కూడా అతడే.. ఇక, 83 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేసిన సూర్యకుమార్.. వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకీ సూర్యకుమార్ సృష్టించినా ఆ ప్రపంచ రికార్డు విషయానికి వస్తే… వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి ఆరు మ్యాచ్‌ల్లోనూ 30కిపైగా పరుగులు చేశాడు.. దీంతో.. ఈ ఫీట్ చేసిన తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు.. ఇప్పటి వరకే నెదర్లాండ్స్ క్రికెటర్ ర్యాన్ టెన్ డస్కటే, టామ్ కూపర్, పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్.. వరుసగా మొదటి ఐదు వన్డేలో 30కి పైగా పరుగులు చేసి రికార్డుకు ఎక్కగా.. ఇవాళ.. సూర్యకుమార్ వారిని వెనక్కి నెట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
Read Also: India vs West Indies 2nd ODI: విండీస్ ముందు చిన్న టార్గెట్…!