పశ్చిమ బెంగాల్లో 25,000 టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. సుప్రీం ధర్మాసనం తీర్పుపై ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25,000 మంది ఉపాధ్యాయ నియామకాలను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25,000 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. రెడ్ రోడ్లో జరిగిన ఈద్ ప్రార్థనల కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ.. అల్లర్లకు ఆజ్యం పోసేందుకు రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి.. దయచేసి ఈ ఉచ్చుల్లో పడకండి.
ఓ కామాంధుడు మేకపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అడ్డుకునేందుకు యత్నించిన మేక యజమాని, అతని కుటుంబీకులపై దాడికి దిగాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల్లోని మాల్దాలో చోటు చేసుకుంది. యజమాని కథనం ప్రకారం.. ఓ వ్యక్తి తన మేకను పొలంలో విడిచిపెట్టాడు. ఆ మేక మేత మేస్తుంది.
RG Kar protests: గతేడాది, కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ పీజీ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై యావత్ దేశం నిరసన, ఆందోళన నిర్వహించాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, ప్రజలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేశారు.
రాజ్యసభలో చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే కేంద్ర దర్యాప్తు సంస్థల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. హోం మంత్రిత్వ శాఖను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా స్పందించిన సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా సంచలన విషయాన్ని వెల్లడించారు. సీబీఐ, ఎంపీ సాకేత్ చెబుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావని ఆయన అన్నారు. కాబట్టి, ప్రశ్నలు లేవనెత్తే ముందు, వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని…
కోల్కతాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఇరాక్-బంగ్లాదేశ్ కేంద్రంగా తుఫాన్ ఏర్పడిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్ సహా మరో 18 రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు.
Gold Smuggling: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలోని గల భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో మంగళవారం నాడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది భారీ బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఢాక నుంచి భారతదేశానికి తీసుకు వస్తున్న రూ.1.48 కోట్ల విలువైన బంగారు కడ్డీలను 32వ బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ అధికారులు అరెస్టు చేశారు.
సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ 10 రోజుల బెంగాల్లో పర్యటిస్తున్నారు. నేడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ తదుపరి కార్యాచరణపై ఆయన వివరణ ఇచ్చారు.