Kolkata Doctor Case: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై 2024 ఆగస్టు 9వ తేదీన పోలీసు వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.
సంక్రాంతి పండగ వేళ పశ్చిమ బెంగాల్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మాల్డాలో టీఎంసీ నేత, పార్టీ కార్యకర్తపై కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది
RG Kar Verdict: పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం నెలకొంది. ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దీంతో కేసు విచారణ సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ కు మరణ శిక్షను విధించే సాక్ష్యాలను సీబీఐ గురువారం నాడు సీల్దా సెషన్స్ న్యాయస్థానానికి అందించింది.
India-Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లా తాత్కిలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఆ దేశంలో భారత వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద సంస్థలు భారత్‌పై విషాన్ని వెళ్లగక్కుతున్నాయి.
భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి.
West Bengal: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా భావించే టీఎంసీ నేతని దుండగులు గురువారం కాల్చి చంపారు. మాల్దాలో ఈ ఘటన జరిగింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్‌ఖాలీలో ఈరోజు (డిసెంబర్30) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించనున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. కాశ్మీర్, కోల్‌కతా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టు జరిగింది. ఆదివారం అనుమానిత ఉగ్రవాదిని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల డిమాండ్ మేరకు కాశ్మీర్‌లోని నిషేధిత 'తెహ్రీక్-ఎ-ముజాహిదీన్' సంస్థకు చెందిన అనుమానిత సభ్యుడు జావేద్ మున్షీని డిసెంబర్ 31 వరకు ట్రాన్సిట్ రిమాండ్‌కు కోర్టు పంపింది.
Suvendu Adhikari: బీజేపీ నాయకుడు, బెంగాత్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి బంగ్లాదేశ్‌కి వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువుల అణిచివేతపై ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌కి 2 రాఫెల్ విమానాలు సరిపోతాయని అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బసిర్హాట్లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఘోజదంగాలో బంగ్లాదేశ్‌లో హిందువులపై మతపరమైన హింసను ఖండిస్తూ నిరసన తెలిపారు.