MP Yusuf Pathan: ఒడిశా రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కి చెందిన వలస కార్మికులపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బెర్హంపూర్ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిన రాష్ట్రం ఒడిశాలో భయంకరమైన పరిస్థితులతో బెంగాల్ రాష్ట్రంలోని తన నియోజకవర్గమైన బెర్హంపూర్, ముర్షిదాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా కార్మికులు పారిపోయి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇక, వలసదారులపై జరిగిన హింసపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ డిమాండ్ చేశారు.
Read Also: Dasari Awards: దాసరి ఫిలిం అవార్డ్స్ ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మి ‘శబరి’
ఇక, బెంగాల్ కి చెందిన వలస కార్మికులపై రాత్రిపూట దాడి చేశారు.. వారి మొబైల్ ఫోన్లు, డబ్బులతో పాటు ఆధార్ కార్డులను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఎంపీ యూసఫ్ పఠాన్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు 2024 ఆగస్టు-సెప్టెంబర్‌లలో కూడా జరిగాయని గుర్తు చేశారు. ప్రాంతీయ గుర్తింపు ఆధారంగా కార్మికులను, ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఆ లేఖ హైలైట్ చేశారు. ఇటువంటి చర్యలు “మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక సూత్రాలను” ఉల్లంఘించడమేనని యూసఫ్ పఠాన్ అభివర్ణించారు.
Read Also: Beauty Tips: వేసవిలో ముఖంపై పుచ్చకాయ రసాన్ని రాసుకుంటే ఇన్ని లాభాలా?
అయితే, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై పట్టుకుని కఠినమైన చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ కోరారు.
వలస కార్మికుల భద్రత, రక్షణను కాపాడాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కేంద్రం ఒక నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌కు తిరిగి వస్తున్న కార్మికులకు అవసరమైన పునరావాస సహాయం అందించడం జరుగుతుందని యూసుఫ్ పఠాన్ అన్నారు.