PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
- కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్
- ఎక్స్‌లో వెల్లడించిన ప్రధాని మోడీ
- ఇటీవల కాలంలో గల్ఫ్ అధినేతలకూ ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖాలిద్‌కు ఫోన్ చేశారు. రాబోయే ఈద్ పండుగ సందర్భంగా కువైట్ యువరాజుతో సంభాషించారు. ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కువైట్ యువరాజుతో సంభాషించిన విషయాలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై మేమిద్దరం అభిప్రాయాలు పంచుకున్నాం. ఇటీవలి పరిణామాలపై ఆందోళనలను తెలియజేశాం. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరిగిన దాడులను భారతదేశం ఖండిస్తోందని పునరుద్ఘాటించాము. హార్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నౌకాయానాన్ని నిర్ధారించడం మా ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం నిరంతర దౌత్య సంబంధాలు అవసరమని మేమిద్దరం అంగీకరించాం. కువైట్‌లోని భారతీయ సమాజం యొక్క భద్రత, శ్రేయస్సు కోసం అందిస్తున్న నిరంతర మద్దతుకు నేను ధన్యవాదాలు తెలిపాను.’’ అని మోడీ ట్వీట్ చేశారు.
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ఇది కూడా చదవండి: Iran-Israel: మరో టాప్ లీడర్‌ను లేపేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ నిఘా మంత్రి హతం అయినట్లు ప్రకటన
గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అప్పట్లోనే గల్ఫ్ అధినేతలతో మోడీ సంభాషించారు.
Prime Minister Narendra Modi spoke with Sheikh Sabah Al-Khaled Al-Hamad Al-Mubarak Al-Sabah, Crown Prince of Kuwait, to convey greetings on the upcoming festival of Eid.
"We exchanged views on the evolving situation in West Asia and shared concerns over recent developments.… pic.twitter.com/3OENtkK9dM
— ANI (@ANI) March 18, 2026
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!