Sharmishta Panoli: ‘‘ఆల్ ఐస్ ఆన్ షర్మిష్ట’’ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. షర్మిష్టకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై సోషల్ మీడియాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంగా బెంగాల్ పోలీసులు శుక్రవారం గురుగ్రామ్ నుంచి అరెస్ట్ చేశారు.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య…
Bypolls 2025: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. తాజాగా, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
West Bengal: పశ్చిమ బెంగాల్ మేదినీపూర్‌లో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య అందరితో కన్నీరు పెట్టిస్తోంది. చిప్స్ దొంగిలించాడనే ఆరోపణలపై బహిరంగంగా అవమానించబడటంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మరణించడానికి ముందు, తన ఇంట్లో తన తల్లికి ఒక సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నేను చిప్స్ దొంగిలించలేదు’’ అని అందులో పేర్కొన్నాడు. ఇది చూస్తే, ఎంతలా ఆ పసి హృదయం బాధించబడిందో అర్థమవుతోంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో జరిగిందని పోలీసులు తెలిపారు.
Murshidabad Violence Report: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో తీవ్రమైన హింస చెలరేగింది. అయితే, ఈ హింసపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటి నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. గత నెలలో జరిగిన ఈ ముర్షిదాబాద్ ఘర్షణలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నాయని, హింసలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని పేర్కొంది. సహాయం కోసం పిలిచినప్పటికీ పోలీసులు స్పందించడంలో విఫలమైనట్లు నివేదిక తెలిపింది.
MP Yusuf Pathan: ఒడిశా రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కి చెందిన వలస కార్మికులపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బెర్హంపూర్ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
Bangladesh vs India: పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టంతో నెలకొన్న హింసపై బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ స్పందించారు. ఈ సందర్భంగా గత వారం బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన హింసలో ముగ్గురు మరణించగా, వందలాది మంది గాయపడిన మైనారిటీ ముస్లిం వర్గాలను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
హింసాకాండ చెలరేగిన ముర్షిదాబాద్‌లో ఈ రోజు ( ఏప్రిల్ 18న ) నుంచి రెండో రోజుల పాటు పర్యటించబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో శాంతిని నెలకొల్పేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఇక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కుట్రలు చేసి అధికారంలోకి రావడానికి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నాను అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనింది.
Bengal Violence: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. ఈ నిరసనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, అనేక మంది త్రీవంగా గాయపడినట్లు పేర్కొన్నారు.