Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం వేట కొనసాగిస్తున్నారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్‌పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది.
పశ్చిమబెంగాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
Rithu Sahu Case: బెంగాల్ విద్యార్థిని రీతు సాహు మృతి కేసు విశాఖ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. కేవలం పోలీసులకే కాదు, విచారణ కమిటీ అధికారులు, కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకులు పాత్రపై నిగ్గు తేల్చాలి.. మొదట పోలీసులు, తర్వాత హైకోర్టు, ఇప్పుడు సీబీఐకి విద్యార్థిని కేసు అప్పగించాలంటూ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. అది 2023 జూలై 14న హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా…
RG Kar Medical College: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ చదువుతున్న గిరిజన మహిళా వైద్య విద్యార్థి మరణం వివాదాస్పదంగా మారింది. పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు తర్వాత, మరోసారి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వార్తల్లో నిలిచింది.
కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా.. ఇద్దరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. పార్టీ తరపున పార్లమెంట్లో గళం వినిపించాల్సిన నేతలు.. వ్యక్తిగత విమర్శలతో రచ్చకెక్కారు. పార్టీని బజారునపడేశారు.
Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అలాగే, బెంగాలీ ప్రజల పట్ల ఆ ( బీజేపీ పాలిత) రాష్ట్రాలు చేస్తున్న దౌర్జన్యాలపై సిగ్గుపడాలి అని మండిపడింది.
Mahua Moitra: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో లా స్టూడెంట్ పై జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతుంది. ఈ క్రమంలో బాధితురాలిదే తప్పంటూ అధికారిక టీఎంసీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా మండిపడింది.
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో బైపోల్స్ జరిగాయి. గుజరాత్లో రెండు స్థానాల్లో ఒకటి బీజేపీ, ఇంకొకటి ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది.