Mahua Moitra: విద్యార్థినిపై అత్యాచారం.. సొంత పార్టీ నేతలపై మహువా మొయిత్రా సీరియస్
- జూన్ 25న కోల్‌కతాలోని లా స్టూడెంట్ పై అత్యాచారం..
- బాధిత విద్యార్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ నేతలు..
- సొంత పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడిన ఎంపీ మహువా మొయిత్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో లా స్టూడెంట్ పై జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతుంది. ఈ క్రమంలో బాధితురాలిదే తప్పంటూ అధికారిక టీఎంసీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా మండిపడింది. భారత్‌లోని అన్ని పార్టీల్లో స్త్రీ ద్వేషులు ఉన్నారని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించింది. ఇక, మరో పోస్టులో విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చింది. ఫిర్యాదు చేసిన 12 గంటల్లోపే పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొనింది. మహిళలపై జరిగే నేరాలను టీఎంసీ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని మొయిత్రా తేల్చి చెప్పింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇక, ఈ అత్యాచార ఘటనపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థినిపై ఆమె స్నేహితులే అత్యాచారం చేస్తే ఎవరేం చేస్తారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కాలేజీల్లో ఉంటారా అని ప్రశ్నించారు. ఆ విద్యార్థిని ఒంటరిగా కాలేజీకి వెళ్లకపోతే.. ఈ ఘటన జరిగేది కాదన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో టీఎంసీ పార్టీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవని.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!