ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తూర్పు మేదినిపూర్‌లో ఓ నిందితుడు పొరుగించిలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడి చేశారు. శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలిని పటాష్పూర్లోని నిందితుడి పక్కింటిలో ఉన్న మహిళగా గుర్తించారు. ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, బలవంతంగా విషం తాగించాడు.
Kolkata Murder Case: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ పిలుపు మేరకు, ఆర్జి కర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై దారుణం, సాగర్ దత్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు అలాగే నర్సులను కొట్టిన సంఘటనకు నిరసనగా ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ఊరేగింపు జరిగింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల నుంచి చేపట్టిన జ్యోతి ప్రజ్వలనలో జూనియర్ డాక్టర్లతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు. ఆర్జీ ట్యాక్స్ కుంభకోణంపై సోమవారం సుప్రీంకోర్టు…
IAS officer's wife's rape: ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారంలో కేసులో పోలీసులు తీరుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఐఏఎస్ అధికారి భార్యపై జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ తప్పుగా నిర్వహించినందుకు ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి కేసుని బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Rachana Banerjee: ఒకప్పటి తెలుగు హీరోయిన్, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీగా ఉన్న రచన బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతున్నాయి. బెంగాల్లో వరద ప్రాంతాలను సందర్శించి ఎంపీ ‘‘క్వింటాళ్ల నీరు’’ అని కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్‌కి దారి తీసింది. హుగ్లీ ఎంపీగా ఉన్న ఆమె మంగళవారం జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘క్వింటాళ్ల, క్వింటాళ్ల కొద్దీ నీరు వచ్చింది, ప్రజలకు ఇళ్లు లేవు. వారు వీధిన…
Kolkata Doctor Case: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ సంచనల వ్యాఖ్యలు చేసింది. తాలా పోలీస్ స్టేషన్లో తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించింది.
Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత సమ్మెలో కూర్చున్న జూనియర్ డాక్టర్లు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆగస్టు 9న కోల్‌కతా ఘటన జరిగినప్పటి నుంచి నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు నెల రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లంతా శనివారం (సెప్టెంబర్ 21) విధుల్లో చేరనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇది గొప్ప ఉపశమనం కలిగించే వార్త. ఎందుకంటే., ఆమె…
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ కష్టాలు చుట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే వైద్యురాలి హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఆయనపై అనేక రకాలుగా అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా బెంగాల్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకుడి హత్య చోటు చేసుకుంది. ఉదయం తుపాకీ కాల్పులు, బాంబులు విసిరి కాంగ్రెస్ నాయకుడిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన కాంగ్రెస్ నేతని షేక్ సైఫుద్దీన్‌గా గుర్తించారు. ఇతను మాణిక్‌చక్‌లోని గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కీలక నేత.